టీమిండియా యువ వికెట్ కీపర్, ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న జితేశ్ శర్మ ఆ జట్టు బ్యాటింగ్ కు వెన్నుముకగా ఉన్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే జితేశ్.. పరిస్థితులకు అనుగుణంగా ఆడటంతో పాటు భారీ హిట్టింగ్ కూడా చేయగల సమర్థుడు. తాజాగా జితేశ్ శర్మ.. బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్, జాహ్నావి కపూర్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ కింగ్స్ ఆటగాడు.. హర్ ప్రీత్ సింగ్, జితేశ్ శర్మలు కలిసి ఓ చిన్న ఫన్ గేమ్ ఆడారు. ఈ సందర్భంగా జితేశ్, హర్ ప్రీత్, అథర్వలను నా ఫేవరేట్ హీరోయిన్ ఎవరు.. అని అడిగాడు. ఈ ప్రశ్నకు హర్ ప్రీత్, అథర్వలు సరైన సమాధానం చెప్పలేకపోయారు.
Also Read : Reels on Instagram: బైక్ పై రీల్స్ చేసిన యువతి.. పోలీసులేం చేశారంటే?
దీంతో తిరిగి జితేశ్ కల్పించుకుని.. నాకు ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనాతౌ, జాహ్నవి కపూర్ అంటే చాల ఇష్టం.. నటనపరంగా కంగనాను ఇష్టపడతాను.. లుక్స్ పరంగా మాత్రం జాహ్నవికి పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే వీడియోలో ఆడమ్ గిల్ క్రిస్ట్ తన ఫేవరేట్ వికెట్ కీపర్ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేగాక తనకు ఇష్టమైన సినిమా కన్నడ సూపర్ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్-1 కేజీఎఫ్-2 అని తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Also Read : ప్రపంచంలోని 10 అతిపెద్ద ఏకశిలలు
కాగా ఐపీఎల్ లో పంజాబ్ తరపున ఆడుతున్న ఈ మహారాష్ట్ర కుర్రాడు.. జనవరిలో భారత జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. భారత్-శ్రీలంక టీ20 సిరీస్ లో సంజూ శాంసన్ గాయపడగా బీసీసీఐ.. మిగిలిన రెండు మ్యాచ్ లకు జితేశ్ ను రిప్లేస్మెంట్ గా ప్రకటించింది. కానీ అతడికి ఈ సిరీస్ లో మ్యాచ్ లు ఆడే అవకాశం దక్కలేదు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న జితేశ్ 2022లో 12 మ్యాచ్ లు ఆడి 10 ఇన్సింగ్స్ లలో 234 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడి స్ర్టైక్ రేట్ 163గా ఉంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు అతడు 5 మ్యాచ్ లు ఆడి 79 పరుగులు చేశాడు.
