ఐపీఎల్ 2022 కోసం తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అన్ని జట్లు ప్రకటించాయి. అయితే అందులో కొన్ని జట్లు తమ ముఖ్యమైన ఆటగాళ్లను తీసుకోలేదు. పంజాబ్ కింగ్స్ జట్టు ఏకంగా తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ నే వేలంలోకి వదిలింది. దాని పై భారత లెజెండరీ లెగ్ స్పిన్నర్… ఆ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ.. మేము అతడిని రిటైన్ చేసుకోవాలని భావించాం. కానీ అతను వేలంలోకి వెళ్ళాలి అనుకున్నాడు. మేము అతని నిర్ణయాన్ని గౌరవిస్తాం. అది ఆటగాళ్ల ప్రత్యేకాధికారం’ అని అనిల్ కుంబ్లే అన్నాడు. అయితే పంజాబ్ కింగ్స్ కేవలం 2 ఆటగాళ్లను మాత్రమే వెనక్కి తీసుకుంది. మయాంక్ అగర్వాల్ ను రూ. 12 కోట్లకు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్ దీప్ సింగ్ ను రూ. 4 కోట్లకు తమతో ఉంచుకుంది. అయితే ఇంకా ఈ జట్టు పర్స్ లో మిగితా అన్ని జట్ల కంటే ఎక్కువగా… 76 కోట్లు ఉన్నాయి. కాబట్టి ఈ జట్టు వేలంలోకి వచ్చిన మంచి ఆటగాళ్లకు ఎక్కువ ధర వ్యచించే అవకాశం ఉంది.