Site icon NTV Telugu

Pak U-19 Team Meet Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ని కలిసిన అండర్-19 టీం.. ప్రధాని షరీఫ్ ఉత్తితేనా..?

Pak

Pak

Pak U-19 Team Meet Army Chief: ఆదివారం (డిసెంబర్ 21న) అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ జట్టు భారత్‌పై 191 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పాక్ 13 ఏళ్ల తర్వాత రెండోసారి అండర్-19 ఆసియా కప్ ట్రోఫీని దక్కించుకుంది. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మన్ సమీర్ మిన్హాస్ అద్భుత ప్రదర్శనతో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోర్‌కు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా అండర్-19 జట్టు, కెప్టెన్ ఆయుష్ మాత్రే నేతృత్వంలోని టీం పూర్తిగా విఫలమైంది. కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది.

Read Also: Annual Order Analysis: ఇన్ స్టా మార్ట్ లో లక్ష రూపాయల కండోమ్స్ ప్యాకెట్లు ఆర్డర్ పెట్టిన వ్యక్తి..

ఇక, పాకిస్తాన్ అండర్-19 క్రికెట్ జట్టు ఆసియా కప్‌లో భారత్‌పై ఘన విజయం సాధించిన అనంతరం ఆ దేశ రక్షణ దళాల చీఫ్‌ ఆసిమ్ మునీర్ ను కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆర్మీ చీఫ్ కి పరిచయం చేశాడు. ఈ కార్యక్రమంలో అండర్ – 19 జట్టు సభ్యులతో పాటు మెంటర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉన్నారు. ఇక, ఆసిమ్ మునీరు మాట్లాడుతూ.. అండర్-19 జట్టు సభ్యులను అభినందించారు. భారత్‌తో జరిగిన ఫైనల్‌లో సాధించిన విజయం పాకిస్తాన్‌కు గర్వకారణమని అతడు పేర్కొన్నారు. ఈ ఘనత కేవలం క్రికెట్ రంగానికే కాకుండా, దేశం మొత్తానికి గర్వంగా నిలిచిందని అన్నారు. యువ క్రికెటర్ల ప్రతిభ, క్రమశిక్షణ, జట్టు సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆసిమ్ మునీర్ ప్రశంసలు కురిపించారు.

Read Also: Kajal : బంగ్లాదేశ్ హింసపై కాజల్ ఆగ్రహం.. చందమామ ధైర్యానికి ఫ్యాన్స్ ఫిదా!

అయితే, అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ యువ క్రికెటర్ల సత్తా మరోసారి రుజువైందని, భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలు సాధించాలని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ మునీరు ఆకాంక్షించారు. ఈ సమావేశం జట్టు సభ్యుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.. దేశం తరఫున ఆడే బాధ్యతను గుర్తు చేసిందని చెప్పుకొచ్చారు. మరోవైపు, పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ను కాకుండా ఆర్మీ చీఫ్ ను కలవడమేంటీ అనే చర్చ కొనసాగుతుంది. ఇటీవల ఆసిమ్ మునీరు కు అపరిమిత అధికారులు కట్టబెట్టారు. దీంతో పాక్ పీఎం డమ్మీ అయిపోయారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version