Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టును వెంటాడుతున్న కష్టాలు.. జీతాల్లో కోత!
- గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు..
- జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్న పాక్ క్రికెట్ బోర్డు..
- ప్లేయర్స్ తీసుకునే జీతాలపై పీసీబీ కోతలు విధించేందుకు రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఫార్మాట్‌తో సంబంధం లేకుండా గడ్డు పరిస్థితులను పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎదుర్కొంటోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3 టెస్టులు ఆడిన పాక్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. అలాగే, ఇప్పటి వరకు ఆడిన 11 వన్డేల్లో తొమ్మిదింట్లో ఓడిపోయింది. ఇక, టీ20ల్లో మెన్ ఇన్ గ్రీన్ కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. 14 మ్యాచ్‌లు ఆడగా ఏడింట్లో గెలిచింది. కానీ, దాయాది జట్టు ప్రదర్శన పట్ల ఆ దేశ క్రికెట్ బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ప్లేయర్స్ తీసుకునే జీతాలపై పీసీబీ కోతలు విధించేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. కాగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్ట్ చేసుకున్న ఆటగాళ్లకు ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూలో 3 శాతం వాటాను బోనస్‌గా అందజేస్తుంది. ఇక, వచ్చే ఏడాది నుంచి ఆ మూడు శాతం వాటాను కట్ చేయాలని పీసీబీ భావిస్తుందంట.
Read Also: సీపీఐ నారాయణ : అమరవీరులకు ద్రోహం చేసేలా మోదీ మాట్లాడారు!
Also Read
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
- Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
అయితే, రెండేళ్ల క్రితం కొందరు పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్స్ ఐసీసీ ఆదాయంలో తమకు వాటా ఇవ్వాలని పీసీబీపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే 3 శాతం వాటాను వారికి ఇస్తుంది. కానీ, ఇప్పుడు జట్టు పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడంతో దాయాది దేశ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు రెడీ అయింది. అలాగే, ఇప్పటికే ఆటగాళ్ల జీతాలను కూడా పెంచే యోచనలో లేనట్లు సమాచారం.
Read Also: NTV Telugu Podcast: నండూరి శ్రీనివాస్ తో ఎన్టీవీ స్పెషల్ పాడ్‌కాస్ట్..
పాక్ ఆటగాళ్ల జీతాలు..?
ఇక, ప్రస్తుతం పీసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీ-ఎలో ఉన్న ప్లేయర్స్ కు పాకిస్తాన్ కరెన్సీలో 4.5 మిలియన్లు ( భారత కరెన్సీలో ఏడాదికి కోటిన్నర రూపాయలు) ఇస్తుంది. అలాగే, ఐసీసీ వాటా నుంచి 2.07 మిలియన్లు లభిస్తున్నాయి. మొత్తంగా ఏ-గ్రేడ్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ.2 కోట్ల పైగా డబ్బులను అందుకుంటున్నారు. కేటగిరీ బీలో ఉన్న ప్లేయర్స్ కు ఐసీసీ వాటా నుంచి 3 మిలియన్లు, పీసీబీ నుంచి 1.5 మిలియన్లు అందజేస్తున్నారు. ఈ కేటగిరిలో ఉన్న వారికి ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.13 కోట్లకుపైగా ఇస్తున్నారు. కేటగిరి సీలోని వారికి మొత్తం 7లక్షలు అందజేస్తున్నారు.
తాజావార్తలు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
-
KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?