Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Padosiyo Ka Haq Hota Shahid Afridi Reacts To Rohit Sharmas India Pakistan Bilaterals Restart Remark

Shahid Afridi: “ఇది పొరుగువారి హక్కు”.. రోహిత్ శర్మ వ్యాఖ్యలపై అఫ్రిది రెస్పాన్స్..

Published Date :April 20, 2024 , 4:24 pm
By BV Reddy
Shahid Afridi: “ఇది పొరుగువారి హక్కు”.. రోహిత్ శర్మ వ్యాఖ్యలపై అఫ్రిది రెస్పాన్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Shahid Afridi: ఇండియా-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలపై ఇటీవల భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచుల్ని పున:ప్రారంభించడం వల్ల టెస్టు క్రికెట్‌కి పెద్ద ఊపునిస్తుందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ స్టార్ ప్లేయర్ షాహీద్ అఫ్రిది స్పందించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాల కారనంగా దశాబ్ధకాలంగా ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు.

Read Also: Ajit Pawar: ఈ ఎన్నికలు ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ మధ్య యుద్ధం..

క్లబ్ ఫ్రైరీ ఫైర్ పోడ్‌కాస్ట్‌ చర్చ సందర్భంగా.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ రోహిత్ శర్మని ప్రశ్నిస్తూ… ‘‘భారతదేశం పాకిస్తాన్‌తో క్రమం తప్పకుండా ఆడటం టెస్ట్ క్రికెట్‌కి అద్భుతంగా ఉంటుందని మీరు అనుకోవడం లేదా..?’’ అని అడిగారు. ఈ ప్రశ్నకు రోహిత్ శర్మ బదులిస్తూ..‘‘ నేను దీన్ని పూర్తిగా నమ్ముతున్నాను, వారిది మంచి జట్టు, అద్భుతమైన బౌలింగ్ లైనప్ ఉంది. మంచి పోటీ ఇస్తుంది. చివరి టెస్ట్ 2007-08లో జరిగింది. పాకిస్తాన్‌తో ఆడటానికి నేను ఇష్టపడుతాను. ఇరు జట్ల మధ్య పోటీ గొప్పగా ఉంటుంది. ఐసీసీ ట్రోఫీల్లో వారితో ఆడుతున్నాము.’’ అని అన్నారు.

రోహిత్ వ్యాఖ్యలపై అఫ్రిది స్పందిస్తూ ఇది సానుకూల ప్రకటన అని ప్రశంసించారు. భారత్-పాకిస్తాన్ మద్య విభేదాలను పరిష్కరించడానికి క్రీడలు సహాయపడతాయని అన్నారు. ‘‘భారత కెప్టెన్ నుంచి ఇది సానుకూల ప్రకటన. అతను భారత రాయబారి కూడా. పాకిస్తాన్-ఇండియా మధ్య సంబంధాల గురించి మేము ఎప్పటి నుంచో చెప్పాము. క్రీడలు ముఖ్యంగా క్రికెట్ గురించి మాట్లాడాం. మేము భారత్ వెళ్లి క్రికెట్ ఆడేవాళ్లం ఇది సంబంధాలను పెంచుతుంది. మంచి సంబంధాలను కలిగి ఉండటం పొరుగువారి హక్కు’’ అని అఫ్రిది సమా టీవీతో అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India-Pakistan Cricket
  • rohit sharma
  • Shahid Afridi
  • sports news

తాజావార్తలు

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

  • Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions