భారతీయులు అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.. క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ ఘన విజయాన్ని అందుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.. ఇప్పటివరకు ఇండియా క్రికెట్ టీమ్ విజ్రుంభించింది.. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది.. ఆస్ట్రేలియా తో తలపడబోతుంది.. మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ చుట్టూ భారీ బందోబస్త్ ను అధికారులు ఏర్పాటు చేశారు.. ఈ మేరకు వైన్ షాపులను కూడా బంద్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఎలాంటి మద్యం అమ్మకాలు ఉండవు. మద్యం అమ్మకాలకు క్రికెట్ కు ఎటువంటి సంబంధం లేదు. కానీ, ఛాల్ పూజ వల్ల ఢిల్లీలో మద్యం అమ్మకాలు ఉండబోవని ఎక్సైజ్ కమిషనర్ కృష్ణ ఉప్పు తాజాగా వెల్లడించారు. ఈ క్రమంలో కమిషనర్ కృష్ణ ఉప్పు అధికారిక ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీలో ఘనంగా చేసుకొనే ఛాత్ పూజ పండగ సందర్భంగా ఆదివారం ఢిల్లీ లో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ లలో ఛాత్ పూజను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడక నాలుగు రోజులపాటు కొనసాగనుంది.. ఈరోజు ఒక్కరోజు మాత్రమే దుకాణాలు బంద్ అని అధికారులు చెబుతున్నారు.. ఇకపోతే ఈ ఏడాది లో మార్చి 8హోలీ, అక్టోబర్ 2 గాంధీ జయంతి, అక్టోబర్ 24 దసరా, నవంబర్ 12 దివాళీ పండుగల వేళ కూడా ఢిల్లీలోని 637 మద్యం దుకాణాలు మూసివేశారు. మళ్లీ డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా మద్యం దుకాణాలను బంద్ చేస్తారు.