Site icon NTV Telugu

Rohit- Kohli: వరల్డ్‌కప్‌ కోసం బీసీసీఐ కొత్త కండీషన్‌ – రోహిత్, కోహ్లీ భవిష్యత్తు ప్రశ్నార్థకం

Roko

Roko

Rohit- Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మరో రెండేళ్లలో (2027) వన్డే ప్రపంచ కప్‌ టోర్నీ జరగనుంది. అప్పటి వరకూ వీరు తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో పాటు ఫామ్‌లోనూ ఉండటం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. అయితే, ఈ వారిద్దరూ ఇప్పటికే, టీ20, టెస్టులకు గుడ్ బై చెప్పి.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు బీసీసీఐ పెట్టే షరతులకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒప్పుకోకపోతే మావన్డే ఫార్మాట్‌కూ కూడా రిటైర్‌మెంట్ ప్రకటించాల్సి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read Also: Tollywood strike : చిరంజీవి మాతో టచ్ లోనే ఉన్నారు.. ఫెడరేషన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యాలు

అయితే, 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు రోహిత్, కోహ్లీని ఎంపిక చేయాలంటే బీసీసీఐ ఓ కండీషన్‌ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి ప్రారంభం అయ్యే.. విజయ్ హజారే ట్రోఫీలో వారిద్దరూ పాల్గొంటేనే ప్రపంచకప్ స్క్వాడ్‌ కోసం పరిగణనలోకి తీసుకొనే ఛాన్స్ ఉంది. ఈ టోర్నీలో ఆడకపోతే వారికి అన్ని దారులు దాదాపుగా మూసుకుపోయినట్లే అని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. కాగా, కొత్త జట్టును తయారు చేసుకోవడానికే గంభీర్‌ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.. ఇప్పటికే టెస్టుల్లో ఇదే జరిగింది. కొత్త డబ్ల్యూటీసీ సీజన్‌లో శుభ్ మన్ గిల్‌కు సారథ్యం ఇవ్వడం ఇదే ప్రధాన కారణం. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడుదామని రోహిత్, కోహ్లీ మొదటి అనుకున్నారు.. కానీ, భవిష్యత్త్ అవసరాల దృష్ట్యా ఎంపిక చేయడం కష్టమేనని బీసీసీఐ తెలియజేయడంతో ఇరువురు టెస్టులకు గుడ్ బై చెప్పేశారు.

Exit mobile version