NTV Telugu Site icon

ODI World Cup 2023: అహ్మదాబాద్‌ పిచ్‌ ఏమైనా నిప్పులు కురిపిస్తుందా.. పీసీబీపై మండిపడిన షాహిద్ అఫ్రిది!

Shahid Afridi

Shahid Afridi

Shahid Afridi slams PCB over India vs Pakistan Match in ODI World Cup 2023: ఆసియా కప్‌ 2023ని హైబ్రీడ్‌ మోడ్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) రంగం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు జరిగే ఈ టోర్నీ మ్యాచులు పాకిస్థాన్‌లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది జరగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. ఆసియా కప్‌ 2023 ఆతిథ్య హక్కులు పాక్ వద్ద ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది చివరలో 2023 వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందో లేదో ఇంకా తెలియరాలేదు. అయితే తన ప్రభుత్వం అనుమతి ఇస్తేనే భారత్‌కు వెళ్తామని తాజాగా పీసీబీ ఛైర్మన్ నజం సేథి పేర్కొన్నాడు.

2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచులో ఆడతామో? లేదో? కూడా ఇప్పుడే చెప్పలేమని పీసీబీ ఛైర్మన్ నజం సేథి అన్నాడు. అయితే మెగా టోర్నీ ముసాయిదా షెడ్యూల్‌ ప్రకారం నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్‌ 15న భారత్ vs పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఉండనుంది. ఈ క్రమంలోనే పీసీబీ తీరుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అహ్మదాబాద్‌ పిచ్‌ ఏమైనా నిప్పులు కురిపిస్తుందా లేదా వేటాడుతుందా? అని ప్రశ్నించాడు. అహ్మదాబాద్‌లో మ్యాచ్‌ను నిరాకరించడం వెనుక అసలు కారణం ఏంటో చెప్పాలని అఫ్రిది డిమాండ్ చేశాడు.

Also Read:
ODI World Cup 2023: భారత్ గడ్డపై మెగా టోర్నీ.. ప్రపంచ్‌కప్‌ 2023 నుంచి పాకిస్తాన్‌ ఔట్‌?
తాజాగా షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ… ‘అహ్మదాబాద్‌ పిచ్‌పై ఎందుకు ఆడకూదు అని అనుకుంటున్నారో చెప్పగలరా?. అహ్మదాబాద్‌ పిచ్‌ ఏమైనా నిప్పులు కురిపిస్తుందా? లేదా మిమ్మల్ని వేటాడుతుందా?. పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఆడాలి, విజయం సాధించాలి. ఇవి మీరు ఊహించిన సవాళ్లు అయితే మాత్రం అహ్మదాబాద్‌ వెళ్లి అద్భుతమైన విజయం సాధించి వాటిని అధిగమించాలి. టీమిండియాను వారి సొంత మైదానంలో ఓడించడానికి వచ్చిన అవకాశాలను వదులుకోకూడదు. ఈ విషయంపై పీసీబీ దృష్టి పెట్టాలి. అంతేకానీ వెనుకడుగు వేయకూడదు. భారీ ప్రేక్షకుల మధ్య విజయం సాధిస్తే ఆ మజానే వేరు’ అని షాహిద్ ఆఫ్రిది తెలిపాడు.

తాజాగా ఆసియా కప్‌ 2023 షెడ్యూల్ ఖరారు కావడంతో ప్రపంచకప్‌ 2023 షెడ్యూల్‌ కూడా త్వరలోనే ఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే అక్టోబర్‌-నవంబర్‌ మధ్య వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. ఇప్పటికే ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. సభ్య దేశాల బోర్డులతో చర్చించిన అనంతరం ఐసీసీ అధికారికంగా షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తుంది.

Also Read: Double Hat-Trick: క్రికెట్‌లో అరుదైన రికార్డు.. ఒకే ఓవర్లో రెండు హ్యాట్రిక్‌లు! సంచలనం సృష్టించిన 12 ఏళ్ల కుర్రాడు