ODI World Cup 2023: అహ్మదాబాద్ పిచ్ ఏమైనా నిప్పులు కురిపిస్తుందా.. పీసీబీపై మండిపడిన షాహిద్ అఫ్రిది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahid Afridi slams PCB over India vs Pakistan Match in ODI World Cup 2023: ఆసియా కప్ 2023ని హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) రంగం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీ మ్యాచులు పాకిస్థాన్‌లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది జరగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. ఆసియా కప్ 2023 ఆతిథ్య హక్కులు పాక్ వద్ద ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది చివరలో 2023 వన్డే ప్రపంచకప్ జరగనుంది. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందో లేదో ఇంకా తెలియరాలేదు. అయితే తన ప్రభుత్వం అనుమతి ఇస్తేనే భారత్‌కు వెళ్తామని తాజాగా పీసీబీ ఛైర్మన్ నజం సేథి పేర్కొన్నాడు.
2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచులో ఆడతామో? లేదో? కూడా ఇప్పుడే చెప్పలేమని పీసీబీ ఛైర్మన్ నజం సేథి అన్నాడు. అయితే మెగా టోర్నీ ముసాయిదా షెడ్యూల్ ప్రకారం నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 15న భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఉండనుంది. ఈ క్రమంలోనే పీసీబీ తీరుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అహ్మదాబాద్ పిచ్ ఏమైనా నిప్పులు కురిపిస్తుందా లేదా వేటాడుతుందా? అని ప్రశ్నించాడు. అహ్మదాబాద్‌లో మ్యాచ్‌ను నిరాకరించడం వెనుక అసలు కారణం ఏంటో చెప్పాలని అఫ్రిది డిమాండ్ చేశాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకరండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
- IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ హిట్టర్‌పై భారీ జరిమానా, నిషేధం..
- ICC Board Meeting: సంచలన నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. ఆ దేశ క్రికెట్ బోర్డు సభ్యత్వం రద్దు..
Also Read:
ODI World Cup 2023: భారత్ గడ్డపై మెగా టోర్నీ.. ప్రపంచ్‌కప్ 2023 నుంచి పాకిస్తాన్ ఔట్?
తాజాగా షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ… ‘అహ్మదాబాద్ పిచ్‌పై ఎందుకు ఆడకూదు అని అనుకుంటున్నారో చెప్పగలరా?. అహ్మదాబాద్ పిచ్ ఏమైనా నిప్పులు కురిపిస్తుందా? లేదా మిమ్మల్ని వేటాడుతుందా?. పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఆడాలి, విజయం సాధించాలి. ఇవి మీరు ఊహించిన సవాళ్లు అయితే మాత్రం అహ్మదాబాద్ వెళ్లి అద్భుతమైన విజయం సాధించి వాటిని అధిగమించాలి. టీమిండియాను వారి సొంత మైదానంలో ఓడించడానికి వచ్చిన అవకాశాలను వదులుకోకూడదు. ఈ విషయంపై పీసీబీ దృష్టి పెట్టాలి. అంతేకానీ వెనుకడుగు వేయకూడదు. భారీ ప్రేక్షకుల మధ్య విజయం సాధిస్తే ఆ మజానే వేరు’ అని షాహిద్ ఆఫ్రిది తెలిపాడు.
తాజాగా ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఖరారు కావడంతో ప్రపంచకప్ 2023 షెడ్యూల్ కూడా త్వరలోనే ఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే అక్టోబర్-నవంబర్ మధ్య వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటికే ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. సభ్య దేశాల బోర్డులతో చర్చించిన అనంతరం ఐసీసీ అధికారికంగా షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తుంది.
తాజావార్తలు
-
Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్’
-
Huawei Nova 16 Series: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. హువావే నోవా 16 సిరీస్ రిలీజ్
-
Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
-
PM Kisan Yojana: రైతులకు అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు!
-
Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!