Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar Reddy Reveals Bowling Plan: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ అద్భుత విజయం అందుకుంది. ఆదివారం రాత్రి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 14 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్‌లో 2-1తో ఆదిక్యంలోకి వెళ్ళింది. మ్యాచ్ అనంతరం భారత ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తమ బౌలింగ్ వ్యూహాలు, జట్టు ప్రదర్శనపై స్పందించాడు. కెప్టెన్ ప్రణాళిక ప్రకారం తాము వికెట్ కోసం కాకుండా.. పరుగులు కట్టడి చేయడం పైనే దృష్టి సారించామని చెప్పాడు.
మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉందని నితీష్ రెడ్డి తెలిపాడు. ‘ఈ మైదానంలో బౌలింగ్ చేయడం అంత సులభం కాదు. అయినప్పటికీ బౌలర్లు తమ ప్రణాళికలను సమర్థంగా అమలు చేశారు. ముఖ్యంగా 16వ ఓవర్‌ను బౌలింగ్ చేస్తున్న సమయంలో వెస్టిండీస్‌కు ఓవర్‌కు 14 పరుగులు అవసరమయ్యాయి. ఆరు బంతుల్లో ఆరు సింగిల్స్ ఇచ్చినా అది మాకు లభిస్తుందని భావించా. వికెట్ తీయడంపై కాకుండా పరుగుల వేగాన్ని నియంత్రించడంపైనే దృష్టి పెట్టాము. కొన్నిసార్లు రక్షణాత్మకంగా కనిపించే వ్యూహం కూడా దూకుడైన ప్రణాళికగా పనిచేస్తుంది’ అని నితీష్ చెప్పాడు.
Also Read
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
- Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
బంతి పొడిగా ఉండటం బౌలింగ్‌కు ఎంతవరకు సహాయపడిందనే ప్రశ్నకు నితీష్ రెడ్డి స్పందిస్తూ.. కెప్టెన్ స్పష్టమైన ప్రణాళికలు ఇచ్చాడని తెలిపాడు. ‘ఫీల్డింగ్‌కు అనుగుణంగా బంతులు వేయడం, ముందుగా అనుకున్న వ్యూహానికి కట్టుబడి ఉండటం ముఖ్యం. మా కెప్టెన్ స్పష్టమైన ప్రణాళికలు ఇచ్చాడు. వికెట్ పడుకున్నా సరే.. రన్స్ ఎక్కువగా ఇవ్వొద్దని చెప్పాడు. మేము అనుకున్న ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేసినప్పుడు బ్యాటర్ సిక్స్ కొట్టినా భయపడకుండా ధైర్యంగా బంతులు వేయాలి. ఒత్తిడిలోనూ బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేయడం విజయానికి కీలకమైంది’ అని వివరించాడు. భారత్ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. ‘జట్టు మంచి ఆరంభం దక్కింది. అయితే మధ్య ఓవర్లలో భాగస్వామ్యాన్ని నిర్మించే ప్రయత్నంలో కొన్ని వికెట్లు అనుకోని విధంగా కోల్పోయాము. అయినప్పటికీ చివర్లో ప్రిన్స్ యాదవ్ చేసిన కీలక పరుగులు జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయి’ అని తెలిపాడు.
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో నితీష్ రెడ్డి బ్యాటింగ్‌లో 14 బంతుల్లో 21 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో రెండు ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మూడో టీ20లోనూ జట్టు విజయానంతరం అతడు వెల్లడించిన వ్యూహాలు చర్చనీయాంశంగా మారాయి. మొత్తంగా వెస్టిండీస్ వంటి దూకుడైన జట్టుపై భారీ స్కోరును కాపాడుకోవడంలో బౌలింగ్ ప్రణాళికలు, ఒత్తిడిని ఎదుర్కొనే ధైర్యం కీలకమని నితీష్ రెడ్డి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!