New BCCI Chief Selector: ఢిల్లీ క్యాపిటల్స్ పదవికి రాజీనామా.. టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Is Ajit Agarkar India New Chief Selector: టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి చేతన్ శర్మ తప్పుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా నాలుగు నెలల నుంచి బీసీసీఐ సెలక్షన్ కమిటీ పదవి ఖాళీగానే ఉండగా.. తాత్కాలిక చైర్మన్‌గా శివ్ సుందర్ దాస్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల సెలక్టర్ పదవికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం (జూన్ 30) చివరి తేదీ. జులై 1న ఇంటర్వ్యూలు జరిగే అవకాశం ఉంది. టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా భారత మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ ఎంపికయ్యే అవకాశం ఉంది.
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ రేసులో టీమిండియా మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కూ అగార్కర్ గుడ్‌బై చెప్పాడు. దీంతో చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్ పేరును బీసీసీఐ ఖరారు చేసిందనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదే జరిగితే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక అజిత్ అగార్కర్ నేతృత్వంలో జరుగుతుంది. అయితే సెలెక్టర్ల వార్షిక వేతనాల అంశాన్ని బీసీసీఐ సమీక్షించనుందని సమాచారం. ప్రస్తుతం ఏడాదికి ఛైర్మన్‌కు రూ.1 కోటి చెల్లిస్తుంది. ఢిల్లీ సహాయక కోచ్‌గా, వ్యాఖ్యాతగా అగార్కర్ అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు. అందులకే వేతన విధానాన్ని సమీక్షించాలని బీసీసీఐ భావిస్తోంది.
Also Read
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవి కోసం 2021లోనూ ప్రయత్నించాడు. ఇంటర్వ్యూకి కూడా హాజరయ్యాడు. అయితే నార్త్ జోన్ నుంచి చేతన్ శర్మ ఎంపికయ్యాడు. ఇప్పుడు మరోసారి దరఖాస్తు చేసుకోవడంతో చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్ పేరును బీసీసీఐ ఖరారు చేసిందట. అగార్కర్ భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ అగార్కర్ ఉన్నాడు. ముఖ్యంగా 2000 నుంచి 2010 వరకు టీమిండియాలో కీలక బౌలర్‌గా అగార్కర్ కొనసాగాడు.
Also Read: Shop Tab on Android TV: గూగుల్ కొత్త ఫీచర్.. స్మార్ట్ టీవీలో షాపింగ్ ట్యాబ్!
Also Read: Hair Care Tips For Men: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మీ జుట్టు మెరిసిపోవడం పక్కా!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!