NTV Telugu Site icon

New BCCI Chief Selector: ఢిల్లీ క్యాపిటల్స్‌ పదవికి రాజీనామా.. టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌!

Bcci Logo

Bcci Logo

Is Ajit Agarkar India New Chief Selector: టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ పదవి నుంచి చేతన్‌ శర్మ తప్పుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా నాలుగు నెలల నుంచి బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ పదవి ఖాళీగానే ఉండగా.. తాత్కాలిక చైర్మన్‌గా శివ్‌ సుందర్‌ దాస్‌ వ్యవహరిస్తున్నారు. ఇటీవల సెలక్టర్‌ పదవికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం (జూన్ 30) చివరి తేదీ. జులై 1న ఇంటర్వ్యూలు జరిగే అవకాశం ఉంది. టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా భారత మాజీ ఆటగాడు అజిత్‌ అగార్కర్‌ ఎంపికయ్యే అవకాశం ఉంది.

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ రేసులో టీమిండియా మాజీ బౌలర్ అజిత్‌ అగార్కర్‌ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కూ అగార్కర్‌ గుడ్‌బై చెప్పాడు. దీంతో చీఫ్‌ సెలక్టర్‌గా అగార్కర్ పేరును బీసీసీఐ ఖరారు చేసిందనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదే జరిగితే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలో జరుగుతుంది. అయితే సెలెక్టర్ల వార్షిక వేతనాల అంశాన్ని బీసీసీఐ సమీక్షించనుందని సమాచారం. ప్రస్తుతం ఏడాదికి ఛైర్మన్‌కు రూ.1 కోటి చెల్లిస్తుంది. ఢిల్లీ సహాయక కోచ్‌గా, వ్యాఖ్యాతగా అగార్కర్‌ అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు. అందులకే వేతన విధానాన్ని సమీక్షించాలని బీసీసీఐ భావిస్తోంది.

అజిత్‌ అగార్కర్ టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ పదవి కోసం 2021లోనూ ప్రయత్నించాడు. ఇంటర్వ్యూకి కూడా హాజరయ్యాడు. అయితే నార్త్‌ జోన్‌ నుంచి చేతన్‌ శర్మ ఎంపికయ్యాడు. ఇప్పుడు మరోసారి దరఖాస్తు చేసుకోవడంతో చీఫ్‌ సెలక్టర్‌గా అగార్కర్ పేరును బీసీసీఐ ఖరారు చేసిందట. అగార్కర్ భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ అగార్కర్ ఉన్నాడు. ముఖ్యంగా 2000 నుంచి 2010 వరకు టీమిండియాలో కీలక బౌలర్‌గా అగార్కర్ కొనసాగాడు.

Also Read: Shop Tab on Android TV: గూగుల్ కొత్త ఫీచర్.. స్మార్ట్ టీవీలో షాపింగ్ ట్యాబ్!

Also Read: Hair Care Tips For Men: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మీ జుట్టు మెరిసిపోవడం పక్కా!