Site icon NTV Telugu

Shahid Afridi: విక్టరీ ర్యాలీలో పాల్గొన్న షాహిద్ ఆఫ్రిది.. చెడుగుడు ఆడుతున్న నెటిజన్లు!

Afridi

Afridi

Shahid Afridi: భార‌తదేశంపై యుద్ధంలో గెలిచామ‌ని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబజ్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అస‌లు తాము కాల్పుల విరమణ కోసం అభ్యర్థించలేదని కూడా ఆయన చెప్పడం గమనార్హం. ఇలా లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ దాయాది దేశ ప్రజలను మభ్య పెడుతున్నారు పాకిస్తాన్ ప్రధాని.

Read Also: S-500: ‘‘ఎస్-400’’ భయపడి చస్తున్నారు.. ‘‘ఎస్-500’’ భారత్-రష్యా కలిసి అభివృద్ధి చేస్తే..

అయితే, తాజాగా ఆ దేశ మాజీ క్రికెట‌ర్ షాహిద్ ఆఫ్రిది మ‌రో అడుగు ముందుకేసి క‌రాచీలో ఇవాళ నిర్వహించిన విక్టరీ ర్యాలీలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో అక్కడి ప్రజలను పలకరిస్తూ.. “పాకిస్తాన్ జిందాబాద్” అని నినాదాలు చేస్తూ.. భారతదేశంపై పాక్ గెలిచిందని చెప్పుకొచ్చాడు. అలాగే, ప‌హ‌ల్గామ్ ఉగ్రదాడి సమయంలోనూ భార‌త ప్రభుత్వంపై, ఇండియన్ ఆర్మీపై అతడు చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. గ‌తంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో పాక్‌కు అనుకూలంగా కూడా ఆఫ్రిది ర్యాలీ చేసి, వార్తల్లో నిలిచాడు.

Read Also: PM Modi: ప్రెస్‌మీట్‌కు ముందు సీనియర్ మంత్రులతో మోడీ కీలక సమావేశం

కాగా, మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది విక్టరీ ర్యాలీపై సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ సదర్భంగా ఓ నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు.. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, 26 ఉగ్రవాద లక్ష్యాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లాంగ్ రేంజ్ వైమానిక జరిపిన దాడులను షాహిద్ అఫ్రిది సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది.. ప్రస్తుతం, అతని మానసిక పరిస్థితి బాగాలేదు తక్షణమే చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నాడు. మరో నెటిజన్ ఇలా కామెంట్స్ చేశాడు.. ఈ పంది, ఆ జిహాదీ షాహిద్ అఫ్రిది ఒక్కసారి ప్రపంచంలో పాకిస్తాన్‌ను ఎలా చూస్తున్నారో వెళ్లి చూడాలని సూచించాడు. భారత్ దెబ్బకి భయపడి మీ జనరల్ ముల్లా మునీర్ ప్యాంటు తడుపుకున్నాడని విమర్శించాడు.

Read Also: Operation Sindoor: భారత్‌కి ప్రయోగశాలగా మారిన పాక్.. టర్కీ, చైనా ఆయుధాలు ఎక్స్‌పోజ్..

ఇక, “షాహిద్ అఫ్రిది”కి కూడా ఇమ్రాన్ ఖాన్ లాగా ట్రీట్మెంట్ అవసరం ఉందని మరో యూజర్ రాసుకొచ్చాడు. ఎందుకంటే.. అతని మానసిక పరిస్థితి బాగాలేదు.. భారత సైన్యం చేసిన దాడులను చూసి అతను ఆశ్చర్యపోయాడు, లేకపోతే ఓడిపోయిన తర్వాత ఎవరైనా విక్టరీ సంబరాలు చేసుకుంటారు? అని పేర్కొన్నాడు. ఇంకో నెటిజన్ ఇలా పోస్ట్ పెట్టాడు.. 100 మందికి పైగా పాక్ ఉగ్రవాదులను కాల్చివేశారు, 40 మంది సైనికులను చంపేశారు, 9 లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేశారు.. 6 జెట్ విమానాలు కూలిపోయాయి.. మరి పాకిస్తాన్ ఏంటో ఊహించండి?.. ఈసారి తక్కువగా నాశనం అవుతున్నామని షాహిద్ అఫ్రిది “విక్టరీ ర్యాలీ” తీశారని నేను అనుకుంటున్నాను అని తెలిపాడు.

https://twitter.com/nagendr_24/status/1921918773356818479

Exit mobile version