Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
- దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్..
- ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన బేబీ బాస్..
- బ్యాట్‌తో విఫలం.. బంతితో అదుర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duleep Trophy: ఐపీఎల్ సూపర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ అంటేనే బ్యాటింగ్.. తన బ్యాట్‌తో ఎన్నో రికార్డులు సృష్టించడమే కాదు.. అవార్డుల పంట కూడా పండింది.. అయితే, తన బ్యాట్‌తోనే కాదు.. బాల్‌తోనూ మ్యాజిక్ చేయగలను అంటున్నాడు.. ఈ యూనివర్సల్ బేబీ బాస్.. దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ బంతితో అదరగొట్టాడు. ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని మరింత కష్టాల్లోకి నెట్టాడు.
నార్త్ ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 111 పరుగులకే ఆలౌట్ కాగా, ఈస్ట్ జోన్ 467 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో నార్త్ ఈస్ట్ జోన్ ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో పడింది. ఎడమచేతి వాటం స్లో ఆర్థడాక్స్ స్పిన్నర్ అయిన వైభవ్ 27వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చి అద్భుత ప్రదర్శన చేశాడు. ఓవర్ రెండో బంతికి కిషన్ లింగ్డోను 25 పరుగుల వద్ద పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత ఐదో బంతికి ఇమ్లివాటి లెమ్టూర్‌ను ఔట్ చేసి ఒకే ఓవర్లో రెండో వికెట్ సాధించాడు.
Also Read
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్‌లకు కీలక పరీక్ష..
- India’s 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..
- Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
మొత్తంగా వైభవ్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 6 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసి ఔట్ అయిన విషయం విదితమే.. ఇక, నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ ఆధిపత్యం కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..