Site icon NTV Telugu

Vijay Hazare 2022: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన సీఎస్‌కే ఆటగాడు

Narayan Jagadeesan

Narayan Jagadeesan

Vijay Hazare 2022: విజయ్ హజారే ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు నారాయణ్ జగదీశన్ రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా నాలుగు సెంచరీలు చేసిన జగదీశన్ తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. దీంతో రోహిత్ శర్మ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతడు డబుల్ సెంచరీ సాధించాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లతో 277 పరుగులు చేయడంతో లిస్ట్ A క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఇప్పటివరకు వన్డేల్లో రోహిత్ శర్మ సాధించిన 266 పరుగులే అత్యధికం కాగా రోహిత్ రికార్డును జగదీశన్ అధిగమించాడు. అటు లిస్టు ఏ క్రికెట్‌లో 500 మార్కు స్కోరు దాటిన మొట్టమొదటి జట్టుగా తమిళనాడు కూడా రికార్డు సాధించింది.

Read Also: Viral News: సీసాలో బయట పడ్డ 135ఏళ్ల నాటి లేఖ .. అందులో ఉన్నది చదవగానే..

ఈ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. అటు ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 112 బంతుల్లో 114 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన నారాయణ్ జగదీశన్ ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 113 బంతుల్లో 107 పరుగులు చేశాడు. గోవాతో మ్యాచ్‌లో 140 బంతుల్లో 168 పరుగులు, హర్యానాతో మ్యాచ్‌లో 123 బంతుల్లో 128 పరుగులు చేశాడు. కాగా 2023 ఐపీఎల్ సీజన్‌కి ముందు జగదీశన్‌ను మినీ వేలానికి విడుదల చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణయం తీసుకుంది. గతంలో మూడు సీజన్లలో ఆడిన నాలుగు మ్యాచుల్లో జగదీశన్ రెండు సార్లు 30 ప్లస్ స్కోర్లు చేశాడు. ప్రస్తుతం జగదీశన్ ఫామ్ దృష్ట్యా వచ్చేనెలలో జరిగే మినీ వేలంలో అతడిని ఫ్రాంచైజీలు భారీ ధరకు దక్కించుకునే అవకాశం ఉంది.

Exit mobile version