Vijay Hazare 2022: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన సీఎస్‌కే ఆటగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Hazare 2022: విజయ్ హజారే ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు నారాయణ్ జగదీశన్ రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా నాలుగు సెంచరీలు చేసిన జగదీశన్ తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. దీంతో రోహిత్ శర్మ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతడు డబుల్ సెంచరీ సాధించాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లతో 277 పరుగులు చేయడంతో లిస్ట్ A క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఇప్పటివరకు వన్డేల్లో రోహిత్ శర్మ సాధించిన 266 పరుగులే అత్యధికం కాగా రోహిత్ రికార్డును జగదీశన్ అధిగమించాడు. అటు లిస్టు ఏ క్రికెట్‌లో 500 మార్కు స్కోరు దాటిన మొట్టమొదటి జట్టుగా తమిళనాడు కూడా రికార్డు సాధించింది.
Read Also: Viral News: సీసాలో బయట పడ్డ 135ఏళ్ల నాటి లేఖ .. అందులో ఉన్నది చదవగానే..
Also Read
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
ఈ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. అటు ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 112 బంతుల్లో 114 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన నారాయణ్ జగదీశన్ ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 113 బంతుల్లో 107 పరుగులు చేశాడు. గోవాతో మ్యాచ్‌లో 140 బంతుల్లో 168 పరుగులు, హర్యానాతో మ్యాచ్‌లో 123 బంతుల్లో 128 పరుగులు చేశాడు. కాగా 2023 ఐపీఎల్ సీజన్‌కి ముందు జగదీశన్‌ను మినీ వేలానికి విడుదల చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణయం తీసుకుంది. గతంలో మూడు సీజన్లలో ఆడిన నాలుగు మ్యాచుల్లో జగదీశన్ రెండు సార్లు 30 ప్లస్ స్కోర్లు చేశాడు. ప్రస్తుతం జగదీశన్ ఫామ్ దృష్ట్యా వచ్చేనెలలో జరిగే మినీ వేలంలో అతడిని ఫ్రాంచైజీలు భారీ ధరకు దక్కించుకునే అవకాశం ఉంది.
విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు క్రికెటర్ నారాయణ్ జగదీషన్ రికార్డు సృష్టించాడు. లిస్ట్ A క్రికెట్‌లో 277 పరుగులు చేసిన అతడు అత్యధిక పరుగుల రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.#NarayanJagadeesan #VijayHazare2022 pic.twitter.com/NJ8Ln3QPct
— AIR News Hyderabad (@airnews_hyd) November 21, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!