MS Dhoni: అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఐపీఎల్ 2028లో కూడా ఎంఎస్ ధోనీ!
- ఐపీఎల్ అభిమానులకు అదిరిపోయే న్యూస్
- ఐపీఎల్ 2028లో ఆడనున్న ధోనీ
- సంబరాలు చేసుకుంటున్న ధోనీ అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు అదిరిపోయే న్యూస్. లెజెండరీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2028 వరకూ ఐపీఎల్లో కొనసాగనున్నాడని సమాచారం. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే 2028 వరకూ ధోనీ ఆడనున్నాడన్న వార్తతో సీఎస్కే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఐపీఎల్లో ధోనీ చివరి మ్యాచ్ ఎప్పుడు అన్న ప్రశ్నకు కనీసం నాలుగేళ్ల గ్యారంటీ దొరికినట్టే అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ధోనీ రిటైర్మెంట్పై గత కొన్నేళ్లుగా ఎన్నో ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే.
2008లో ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కేతోనే కొనసాగుతున్న ఎంఎస్ ధోనీ.. ఫ్రాంచైజీకి ముఖచిత్రంగా మారిపోయాడు. మహీ నాయకత్వంలో సీఎస్కే ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. ఐదు ఐపీఎల్ టైటిల్స్, పదికి పైగా ఫైనల్స్.. ఈ రికార్డులన్నీ ధోనీ కెప్టెన్సీకి నిదర్శనం. వయసు పెరిగినా సరే.. ధోనీ వికెట్‌కీపింగ్, గేమ్ రీడింగ్, మ్యాచ్ ఫినిషింగ్ స్కిల్స్ ఇప్పటికీ అదే స్థాయిలో ఉన్నాయి. ఇటీవలి సీజన్లలో బ్యాటింగ్‌లో పరిమిత ఓవర్లే ఆడుతున్నా.. జట్టుపై అతడి ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ ఉంటే యువ ఆటగాళ్లకు ధైర్యం వస్తుందనే చెప్పాలి. కెప్టెన్సీ బాధ్యతలు రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించినా.. బ్యాక్ఎండ్ నుంచి జట్టును నడిపిస్తున్నాడు.
Also Read
- RCB Playing XI: గుజరాత్ టైటాన్స్‌ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్‌లో బిగ్ ఛేంజ్..
- క్వాలిఫైయర్-1లో చిత్తు చేసిన RCB.. ఫైనల్లో GT ప్రతీకారం తీర్చుకుంటుందా? క్లైమాక్స్ ఫైట్ పూర్తి వివరాలు ఇవే..
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్‌మన్ గిల్..
Also Read: Mohammed Kaif: అతడు క్రిస్ గేల్ కన్నా డేంజరస్ బ్యాటర్.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యం!
మార్చి 26 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం ఎంఎస్ ధోనీ సాధన షూరూ చేశాడు. 2 నెలల ముందుగానే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రాంచీలోని జేఎస్సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రస్తుతం మహీ సాధన చేస్తున్నాడు. వచ్చే నెలలో చెన్నైలో సాధన చేయనున్నాడు. 278 ఐపీఎల్ మ్యాచులలో 5439 రన్స్ చేశాడు. మహీ అత్యుత్తమ స్కోర్ 84 నాటౌట్. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి ఇన్ని రన్స్ చేయడం ఆషామాషీ కాదు.
తాజావార్తలు
-
Peddi Pre-Release Event : ‘పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో
-
Mamata Banerjee: “ఇక మేమేంటో చూపిస్తాం”.. అల్లుడు అభిషేక్‌పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
-
LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
-
RCB vs GT Final: ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. ఐపీఎల్ 2026 విజేత ఎవరు?.. పూర్తి వివరాలు ఇవే!
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్‌ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్‌లో బిగ్ ఛేంజ్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..