Site icon NTV Telugu

MS Dhoni: అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఐపీఎల్‌ 2028లో కూడా ఎంఎస్ ధోనీ!

Ms Dhoni Csk

Ms Dhoni Csk

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు అదిరిపోయే న్యూస్. లెజెండరీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2028 వరకూ ఐపీఎల్‌లో కొనసాగనున్నాడని సమాచారం. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే 2028 వరకూ ధోనీ ఆడనున్నాడన్న వార్తతో సీఎస్‌కే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఐపీఎల్‌లో ధోనీ చివరి మ్యాచ్ ఎప్పుడు అన్న ప్రశ్నకు కనీసం నాలుగేళ్ల గ్యారంటీ దొరికినట్టే అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ధోనీ రిటైర్మెంట్‌పై గత కొన్నేళ్లుగా ఎన్నో ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే.

2008లో ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్‌కేతోనే కొనసాగుతున్న ఎంఎస్ ధోనీ.. ఫ్రాంచైజీకి ముఖచిత్రంగా మారిపోయాడు. మహీ నాయకత్వంలో సీఎస్‌కే ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. ఐదు ఐపీఎల్ టైటిల్స్, పదికి పైగా ఫైనల్స్.. ఈ రికార్డులన్నీ ధోనీ కెప్టెన్సీకి నిదర్శనం. వయసు పెరిగినా సరే.. ధోనీ వికెట్‌కీపింగ్, గేమ్ రీడింగ్, మ్యాచ్ ఫినిషింగ్ స్కిల్స్ ఇప్పటికీ అదే స్థాయిలో ఉన్నాయి. ఇటీవలి సీజన్లలో బ్యాటింగ్‌లో పరిమిత ఓవర్లే ఆడుతున్నా.. జట్టుపై అతడి ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ ఉంటే యువ ఆటగాళ్లకు ధైర్యం వస్తుందనే చెప్పాలి. కెప్టెన్సీ బాధ్యతలు రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించినా.. బ్యాక్‌ఎండ్ నుంచి జట్టును నడిపిస్తున్నాడు.

Also Read: Mohammed Kaif: అతడు క్రిస్‌ గేల్‌ కన్నా డేంజరస్ బ్యాటర్.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యం!

మార్చి 26 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం ఎంఎస్‌ ధోనీ సాధన షూరూ చేశాడు. 2 నెలల ముందుగానే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రస్తుతం మహీ సాధన చేస్తున్నాడు. వచ్చే నెలలో చెన్నైలో సాధన చేయనున్నాడు. 278 ఐపీఎల్ మ్యాచులలో 5439 రన్స్ చేశాడు. మహీ అత్యుత్తమ స్కోర్ 84 నాటౌట్. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి ఇన్ని రన్స్ చేయడం ఆషామాషీ కాదు.

 

Exit mobile version