Pakistan Cricket: బాబర్‌ను తీసేయాలని చెప్తే, నన్నే తీసేశారు.. పాక్ మాజీ సంచలన వ్యాఖ్యలు..

  • బాబర్ అజమ్‌ను తీసేయాలని చెప్తే, నన్నే తీసేశారు..
  • పాకిస్తాన్ మాజీ స్టార్ సంచలన వ్యాఖ్యలు..
  • బాబర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన యూసుఫ్..
Pakistan

Pakistan

Mohammad Yousuf: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం ఆ దేశంలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. అభిమానులు, పాక్ మాజీలు పాక్ టీమ్‌పై, ప్లేయర్ల ఆటతీరుపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా, పాకిస్తాన్ స్టార్ ఆటగాడిగా భావించే బాబర్ అజమ్‌పై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. బాబర్‌తో పాటు షహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు.

Read Also: Hanuman Statue: హనుమాన్ విగ్రహంపై అమెరికన్ నేత అనుచిత వ్యాఖ్యలు..

తాజాగా, పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ యూసుఫ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాబర్ ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో రన్స్ చేయడంలో దారుణంగా విఫలమవుతున్నాడు. మూడు మ్యాచుల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేశాడు. యూనస్ మాట్లాడుతూ.. బాబర్‌ను టీం నుంచి డ్రాప్ చేయాలని తాను సెలక్టర్‌గా ఉన్నప్పుడు సూచించానని, కానీ అందరూ తనపై తిరుగుబాటు చేసి, రాజీనామా చేసేలా చేశారని ఆయన అన్నారు.

గత 2-3 ఏళ్లుగా బాబర్ టెక్నిక్ పూర్తిగా దెబ్బతిందని, అతను ఫామ్‌లో లేడని అన్నారు. నిజానికి ఒక ప్లేయర్ ఫామ్‌ లేకపోవడం కేవలం ఒకటి రెండు టోర్నీలో మాత్రమే ఉంటుందని, కానీ బాబర్ మూడు ఏళ్లుగా పెద్ద స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నాడని యూసుఫ్ విమర్శించారు. బాబర్‌ను టీం నుంచి తీసేయాలని నేను చెబితే, మేనేజ్మెంట్ తిరస్కరించిందని, చివరకు తాను సెలక్టర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని యూసుఫ్ చెప్పారు. బాబర్‌ను తమ కాలం నాటి దిగ్గజ ప్లేయర్లతో పోల్చే స్థాయి కాదని స్పష్టం చేశారు. ఇంజమామ్ ఉల్ హక్, సయీద్ అన్వర్, జహీర్ అబ్బాస్ వీరి స్థాయి వేరే అని, వీరిని బాబర్ మ్యాచ్ చేయలేడని అన్నారు.