T20 World Cup: ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ మరోసారి పాకిస్థాన్ జట్టుకు మెంటార్‌గా నియమితుడయ్యాడు. గత ఏడాది మాదిరిగానే పాకిస్థాన్ టీం మేనేజ్ మెంట్ టీ20 ప్రపంచకప్ మాథ్యూ హేడెన్‌ను సహాయక సిబ్బందిగా నియమించుకుంది. ప్రధాన కోచ్ సక్లైన్ ముస్తాక్, ఇతరులతో కలిసి మెంటార్ బాధ్యతలను హేడెన్ పోషించనున్నాడు. రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో క్రికెటర్ అయిన హేడెన్.. బ్రిస్బేన్‌లో అక్టోబర్ 15న పాకిస్థాన్ జట్టుతో చేరనున్నాడు. ఈసారి టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉన్నందున.. పాకిస్థాన్ జట్టుకు హేడెన్ సహకారం కాస్త సానుకూలాంశంగా మారనుంది.
Read Also: Top Gare: ఆ వివాదంలో ‘పుష్ప’ విలన్..
కాగా గత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో సెమీఫైనల్లో నాటకీయ పరిస్థితుల్లో ఓడిపోయింది. ఈ ఏడాది పాకిస్థాన్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. దీంతో రెండోసారి టీ20వరల్డ్‌కప్ గెలవాలనే కసితో ఆ జట్టు ఉంది. అటు ఆస్ట్రేలియాలో జరిగే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం తాను పాకిస్థాన్ జట్టుకు మెంటార్‌గా పనిచేయనున్నానని.. మళ్లీ పాకిస్థాన్ జట్టుతో చేరడానికి ఎదురుచూస్తున్నానని.. వన్ నేషన్ వన్ ప్యాషన్ స్ఫూర్తిని పొందేందుకు రెడీ అయ్యానని హేడెన్ చెప్పాడు.
