Marykom: భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ కామన్వెల్త్ ఆశలు ఆవిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరుసార్లు వరల్డ్ చాంపియన్, కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా రెండో పసిడి సాధించాలనే భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఆశలు ఆవిరయ్యాయి. బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ క్రీడల కోసం భారత బాక్సింగ్ జట్టును ఎంపిక చేసేందుకు ఇందిరా గాంధీ స్టేడియంలో ట్రయల్స్ జరుగుతున్నాయి. మహిళల 48 కేజీల విభాగంలో ఎంసీ మేరీకోమ్ పోటీపడింది. శుక్రవారం జరిగిన ట్రయల్స్ తొలి రౌండ్‌లో కాలు గాయానికి గురైన మేరీకోమ్.. బౌట్ మధ్యలోనే నిష్క్రమించింది. 2018 కామన్‌వెల్త్ క్రీడల పసిడి విజేత, 39 ఏండ్ల మేరీకోమ్ తొలి రౌండ్‌లోనే పడిపోయింది. అయినా, బౌట్ కొనసాగించింది. కానీ వరుస పంచ్‌లతో ఎడమ కాలు సమన్వయం కోల్పోయింది. పడిపోయిన మేరీకోమ్‌ను రింగ్ నుంచి స్ట్రెచర్‌పై తీసుకెళ్లగా.. హర్యానా బాక్సర్ నితూను రిఫరీ విజేతగా ప్రకటించాడు.
అనంతరం సిబ్బంది సాయంతో మేరీ రింగ్ నుంచి బయటకు వెళ్లింది. స్కానింగ్ కోసం తనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కెరీర్‌పై ఈ గాయం ప్రభావం చూపే అవకాశం ఉంది. గతేడాది టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఆమె బరిలో దిగిన తొలి బౌట్ ఇదే. పోరు మొదలైన కొన్ని నిమిషాల్లోనే కిందపడ్డ ఆమెకు గాయమవడం తనకు వయసు మీద పడుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆమెకు అయిన ఈ మోకాలి గాయం మేరీ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
IPL Media Rights: ఐపీఎల్ బిడ్డింగ్ రేసు నుంచి అమెజాన్, గూగుల్ అవుట్
Also Read
- Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్‌న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్‌లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇక, 50 కిలోల విభాగంలో తెలుగమ్మాయి, నయా వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ సెమీస్‌లో 7-0తో అనామికపై నెగ్గి ఫైనల్ చేరింది. పంచ్‌లతో చెలరేగిన నిఖత్.. ప్రత్యర్థిపై పిడిగుద్దులు కురిపించింది. శనివారం జరగబోయే ఫైనల్‌లో మీనాక్షితో నిఖత్ తలపడనుంది. ఈ బౌట్‌లో విజయం సాధిస్తే నిఖత్‌కు కామన్వెల్త్ బెర్త్ ఖాయమవుతుంది.
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్‌న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..