IPL Media Rights: ఐపీఎల్ బిడ్డింగ్ రేసు నుంచి అమెజాన్, గూగుల్ అవుట్
ఎంతో ఆసక్తి రేపిన ఐపీఎల్ 2022 సీజన్ దిగ్విజయంగా ముగిసింది. దీంతో తదుపరి సీజన్‌పై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో కొత్తగా ఈ ఏడాది రెండు జట్లు చేరడంతో పోటీతత్వం పెరిగి టోర్నీ మరింత రసవత్తరంగా సాగుతోంది. 2022 వరకు ఈ టోర్నీ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను స్టార్ ఇండియా కొనుగోలు చేసింది. అప్పట్లో సోనీ పిక్చర్స్‌ను బీట్ చేసిన స్టార్ ఇండియా రూ.16,347.50 కోట్ల రూపాయలకు బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు దక్కించుకుంది. ఈ డీల్‌తో ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ ఖరీదు రూ.55 కోట్లకు చేరింది. అయితే ఈ డీల్ ఈ ఏడాదితో ముగిసింది.
కొత్త డీల్ కోసం ఈనెల 12న వేలం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ ప్రక్రియ రెండు మూడు రోజులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రపంచ కుబేరులు జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌ల మధ్య పోటీ ఉంటుందని వ్యాపార వర్గాలు భావించాయి. అయితే తాజాగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ వేలం నుంచి అమెజాన్ తప్పుకుందట. కారణం ఏంటో తెలియరాలేదు కానీ.. అమెజాన్ ఈ వేలంలో పాల్గొనడం లేదని మాత్రం వార్తలు వస్తున్నాయి.
Also Read
- Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
- Ravindra Jadeja: అయ్యబాబోయ్.. కాస్త ఉంటే అభిమానులను కొట్టేలాగా ఉన్నాడే.! వీడియో వైరల్
- Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!
- Mohsin Khan: "మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్".. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
మరోవైపు గూగుల్ (యూట్యూబ్) కూడా డిజిటల్ ప్రసారహక్కులపై ఆసక్తి చూపుతూ బిడ్ డాక్యుమెంట్ తీసుకుందని.. కానీ ఎందుకో ఆ డాక్యుమెంట్‌ను తిరిగి సమర్పించలేదని బీసీసీఐ అధికారులు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం టీవీ, స్ట్రీమింగ్ హక్కుల రేసులో 10 సంస్థలు మిగిలాయని తెలిపారు. కాగా 2023 నుంచి 2027 వరకు టెలివిజన్, డిజిటల్ కంటెంట్ ప్రసార హక్కుల కోసం బీసీసీఐ ఈ బిడ్డింగ్ నిర్వహిస్తోంది. ఈ ఐదేళ్లలో తొలి మూడేళ్ల పాటు 74 మ్యాచ్ లు, చివరి రెండేళ్లలో 94 మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
-
Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
-
Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?