NTV Telugu Site icon

Manish Pandey: అప్పుడు నా కెరీర్ నాశనం చేశారు.. ఇప్పుడు శాంసన్ కెరీర్ నాశనం చేస్తున్నారు

Manish Pandey

Manish Pandey

Manish Pandey: బీసీసీఐపై టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ పర్యటనలో మూడు టీ20ల సిరీస్‌లో సంజు శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై బీసీసీఐపై తీవ్ర విమర్శలు రాగా మనీష్ పాండే కూడా అభిమానులకు మద్దతు పలికాడు. గతంలో పదే పదే తనను రిజర్వుబెంచ్‌పై కూర్చోబెట్టి తన కెరీర్ నాశనం చేశారని.. ఇప్పుడు సంజు శాంసన్ కెరీర్ కూడా అలాగే చేస్తున్నారని మనీష్ పాండే అన్నాడు. తనను జట్టులోకి ఎంపిక చేయకుండా రిజర్వు బెంచ్‌పై కూర్చోబెట్టడంతో తాను మానసికంగా బలహీనంగా మారి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయానని పాండే తెలిపాడు. టీమిండియాలో తాను ఆడిన మ్యాచ్‌ల కంటే రిజర్వు బెంచీపై కూర్చున్న మ్యాచ్‌ల సంఖ్యే ఎక్కువ అని వివరించాడు.

Read Also: Narendra Modi: ప్రపంచ ర్యాంకుల్లో మరోసారి మోదీనే నంబర్‌వన్

అయితే టీమ్‌కు ఎవరు అవసరమో కెప్టెన్, కోచ్ నిర్ణయించినా.. జట్టులోకి ఎంపికైన వాళ్ల కంటే తాము తక్కువ కాదనే దృక్పథంతో ఉండాలని మనీష్ పాండే అభిప్రాయపడ్డాడు. రిజర్వు బెంచ్‌లో కూర్చున్నా.. అది మన ఆటపై ప్రభావం చూపించకుండా చూసుకోవాలన్నాడు. జట్టులోకి ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండాలని.. తన వరకు అయితే వచ్చిన మ్యాచుల్లో బాగా ఆడాలని తాపత్రయపడ్డానని.. కానీ ఫలితం లభించలేదన్నాడు. ఇప్పుడు సంజూ శాంసన్ మంచి ఫామ్‌లో ఉన్నాడని.. అవకాశం వచ్చిన మ్యాచుల్లో బాగా ఆడుతున్నాడని.. తాను కూడా ఇదే మైండ్‌సెట్‌తో ఉంటే బెటర్ అన్నాడు. అవకాశం వచ్చినప్పుడు ఆడితే టీమ్‌లో ప్లేస్ దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని పాండే అన్నాడు. త్వరలోనే టీమిండియాలో తిరిగి చోటు సంపాదించుకుంటాననే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్ విషయానికి వస్తే ఈ ఏడాది లక్నో సూపర్‌జెయింట్స్ జట్టులో ఆడి రాణించలేకపోవడంతో మనీష్ పాండేను ఆ జట్టు వేలంలోకి విడుదల చేసింది. కాగా పాండే ఇప్పటివరకు టీమిండియా తరపున 29 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లను ఆడాడు.

Read Also: 26/11 Mumbai Attacks: పోలీస్ త్యాగానికి గుర్తుగా ఊరి పేరు మార్పు