Mahendra Singh Dhoni: రేపు శుభవార్త చెప్పనున్న ధోనీ.. సర్ప్రైజ్పై సర్వత్రా సస్పెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahendra Singh Dhoni: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ నెల 25న సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియా లైవ్‌లోకి వచ్చి సర్ప్రైజ్ను ధోనీ రివీల్ చేయనున్నాడు. సాధారణంగా ధోనీ సోషల్ మీడియాలో అంతంత మాత్రంగానే యాక్టివ్‌గా ఉంటాడు. చాలా అరుదుగా పోస్టులు చేస్తుంటాడు. అయితే ఫేస్బుక్లో మాత్రం అప్పుడప్పుడు పోస్టులు పెట్టి అభిమానులను ఉత్సాహపరుస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఈనెల 25న లైవ్‌లో ఓ సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి అభిమానులను సందేహంలోకి నెట్టాడు. దీంతో ఇంతకీ ధోనీ చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏమై ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also:FNCC Elections: రేపే ఎఫ్ఎన్సిసి ఎన్నికలు
Also Read
- Daren Sammy: మేము భారత్‌తో ఎంత గొప్పగా ఆడామో ఇప్పటికైనా తెలిసిందా.. విండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు..
- Ind Vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా దండయాత్ర.. భారత్ అద్భుత విజయం.. 3-0తో సిరీస్ కైవసం..
- Ind Vs NZ: సెంచరీతో కదం తొక్కిన కాటేరమ్మ కొడుకు.. పలు ప్రపంచ రికార్డులు బద్దలు..
- CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి సీనియర్ ఆటగాళ్ల పునరాగమనం..!
అయితే ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగా ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేస్తాడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం రిటైర్మెంట్పై కాకుండా వేరే న్యూస్ అయి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి ధోనీ చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ధోనీ సారథ్యంలో టీమిండియా అన్ని ఐసీసీ ఈవెంట్లలో విజయం సాధించింది. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచింది. 2011లో వన్డే ప్రపంచకప్‌ను కూడా ధోనీ సారథ్యంలోనే భారత్ సాధించింది. ధోనీ నాయకుడిగా ఉన్నప్పుడే టెస్టుల్లోనూ నంబర్‌వన్‌గా అవతరించింది. అటు ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు విజయవంతమైన కెప్టెన్‌గా ధోనీ కొనసాగుతున్నాడు.
తాజావార్తలు
-
Daren Sammy: మేము భారత్‌తో ఎంత గొప్పగా ఆడామో ఇప్పటికైనా తెలిసిందా.. విండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు..
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. కరువుపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ
-
Killer : సెకండాఫ్ ట్విస్ట్ చెప్తే కోటి రూపాయల బహుమతి.. హైకోర్టు లాయర్ల సమక్షంలో ఛాలెంజ్
-
InnoData Layoffs: ఇన్నోడేటాలో భారీ ఉద్యోగ కోతలు.. భారత్‌లో 550 మందికి ఉద్వాసన?
-
Ind Vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా దండయాత్ర.. భారత్ అద్భుత విజయం.. 3-0తో సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!