LG vs RR : ఐపీఎల్ 2025 సీజన్ లో ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతోంది. తాజాగా లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతోంది. రాజస్థాన్ కెప్టెన్ సంజు సామ్సన్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడు. అతని స్థానంలో రియాన్ పరాగ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇంకోవైపు లక్నో టీమ్ లోకి యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతను ఐపీఎల్ లోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఇక లక్నో టీమ్ లో రిషబ్ పంత్ పైనే ఆశలు ఉన్నా.. అతను ఫామ్ లో లేడు. రాజస్థాన్ లో యశస్విపైనే ఆశలు ఎక్కువగా ఉన్నాయి.