NTV Telugu Site icon

Lionel Messi: యూ-టర్న్ తీసుకున్న మెస్సీ.. ఫ్యాన్స్‌కి పండగే!

Lionel Messi Retirement

Lionel Messi Retirement

Lionel Messi Takes U Turn On His Retirement: ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ మ్యాచ్ ముందువరకూ.. తనకు ఇదే చివరి వరల్డ్‌కప్ అని, మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తానని లియోనెల్ మెస్సీ పలుసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే! కానీ.. ఇప్పుడు ఈ విషయంలో అతడు యూ-టర్న్ తీసుకున్నాడు. తనకు ఇప్పుడప్పుడే ఫుట్‌బాల్ ఆటకు గుడ్‌బై చెప్పాలని లేదని చెప్పాడు. వరల్డ్ ఛాంపియన్‌గా తనకు మరికొన్ని గేమ్స్ ఆడాలని ఉందని, తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఒకరకంగా ఇది అతని అభిమానులకు పండగలాంటి వార్తేనని చెప్పుకోవాలి.

Fifa World Cup: వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఓటమి.. ఫ్రాన్స్‌లో చెలరేగిన అల్లర్లు

మెస్సీ మాట్లాడుతూ.. ‘‘ఈ వరల్డ్‌కప్ అనంతరం నేను ఫుట్‌బాల్ ఆటకు గుడ్‌బై చెప్పాలని అనుకున్నా. నా కెరీర్‌లో వరల్డ్‌కప్ లేదనే లోటు ఉండేది, ఇప్పుడది తీరిపోవడంతో నేను ఇంకేం కోరుకోవడం లేదు. ఇంతకుముందు కోపా అమెరికా సాధించాడు. ఇప్పుడు ఈ వరల్డ్‌కప్ గెలుపొందాను. ఈ వరల్డ్‌కప్ కోసం ఎంతో శ్రమించి, చివరికి నా కెరీర్‌కి గుడ్‌బై చెప్పే సమయంలో సాధించగలిగాను. అయితే.. వరల్డ్ ఛాంపియన్‌గా నాకు మరిన్ని గేమ్స్ ఆడాలని ఉంది. నాకు ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టం’’ అంటూ చెప్పుకొచ్చాడు. తనకు మరిన్ని గేమ్స్ ఆడాలని ఉందని మెస్సీ స్పష్టం చేయడాన్ని బట్టి చూస్తే.. అతడు ఇప్పుడప్పుడే ఫుట్‌బాల్‌కి గుడ్‌బై చెప్పడని క్లారిటీ ఇచ్చేసినట్టే! ఒకవేళ సాధ్యమైతే.. వచ్చే వరల్డ్‌కప్ వరకూ అతడు కొనసాగినా కొనసాగవచ్చు.

Raghunandan Rao: రాజకీయం అంటే.. డ్రగ్స్ తీసుకున్నంత ఈజీ కాదు

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఫైనల్స్‌లో తలపడిన అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు నిర్దిష్ట సమయం ముగిసేలోపు చెరో రెండు గోల్స్ (2-2) చేశాయి. మ్యాచ్ టై అవ్వడంతో అదనపు సమయం కేటాయించారు. ఆ టైంలో చెరో గోల్స్ చేయడంతో.. 3-3తో మ్యాచ్ మళ్లీ టై అయ్యింది. దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఈ రౌండ్‌లో అర్జెంటీనా 4 గోల్స్, ఫ్రాన్స్ 2 గోల్స్ చేశాయి. ఫలితంగా.. అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. వరల్డ్‌కప్ సాధించాలన్న మెస్సీ కల నెరవేరింది. మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా తొలిసారి వరల్డ్‌కప్ సాధించగా.. ఇప్పటివరకూ ఓవరాల్‌గా మూడుసార్లు (ఇంతకుముందు 1978, 1986) విశ్వవిజేతగా నిలిచింది.

Love Marriage at YSP Office: ప్రేమికులను కలిపిన ఎమ్మెల్యే.. వైసీపీ కార్యాలయంలో పెళ్లి..

Show comments