Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
- ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
- అత్యంత టెన్షన్‌కు గురైనట్లు వెల్లడి
- 2025లో బెంగాలీలో ఆలపించిన లారా రైట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ గాయని లారా రైట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2025లో ఇంగ్లండ్‌తో జరిగిన భారత్ టెస్టు సిరీస్ సందర్భంగా లారా రైట్ భారత జాతీయ గీతం ‘జన గణ మన’ను బెంగాలీలో ఆలపించారు. ఆ సమయంలో తాను ఎంతో ఆందోళనకు గురయ్యానని గుర్తుచేసుకున్నారు. ‘‘నేను తొలిసారి భారత జాతీయ గీతం పాడేటప్పుడు బహుశా నా జీవితంలోనే అత్యంత టెన్షన్‌కు గురయ్యాను. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకునే సమయంలో ఇటాలియన్, జర్మన్ భాషలపై ప్రాథమిక అవగాహన ఉంటుంది. కానీ జాతీయ గీతాలు పాడేటప్పుడు ఎన్నో భాషలను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని తెలిపారు.
భారత జాతీయ గీతాన్ని సరిగ్గా ఆలపించేందుకు చాలా సమయం కేటాయించినట్లు చెప్పారు. ‘‘భారత జాతీయ గీతాన్ని చాలాసార్లు విన్నాను. ఆ భాష మాట్లాడే ఇద్దరు, ముగ్గురితో కలిసి ఉచ్చారణను తెలుసుకున్నాను. పదాలను ఎలా పలకాలి, ఎక్కడ ఎలా పదాలను విభజించాలి, వాటి అర్థం ఏమిటి అనే విషయాలను అర్థం చేసుకున్నాను. నా కెరీర్లో ప్రేక్షకులకు కనిపించని కృషి ఇదే’’ అని లారా రైట్ పేర్కొన్నారు.
Also Read
- Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
- India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్‌లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
- India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
ఇక పాకిస్థాన్ జాతీయ గీతాన్ని పాడేందుకు ఏకంగా ఆరు నెలల పాటు ఉర్దూ నేర్చుకున్నట్లు తెలిపారు. ఇంగ్లండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌కు ముందు ఆమె ఉర్దూలో పాకిస్థాన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ.. జాతీయ గీతాన్ని సరైన ఉచ్చారణతో పాడేందుకు తాను చేసిన కృషిని లారా రైట్ వెల్లడించారు.
ఇంగ్లాండ్‌కు చెందిన మెజ్జో-సోప్రానో గాయని లారా రైట్‌కు అంతర్జాతీయ స్థాయిలో పలు క్రీడా కార్యక్రమాల్లో జాతీయ గీతాలను ఆలపించిన అనుభవం ఉంది. తాజాగా హెడ్డింగ్లీలో ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య తొలి టెస్టుకు ముందు ఆమె పాకిస్థాన్ జాతీయ గీతాన్ని ఉర్దూలో పాడారు.
ఆరు నెలలుగా ఉర్దూ నేర్చుకుంటున్నా..
పాకిస్థాన్ జాతీయ గీతాన్ని పాడేందుకు తాను గత ఆరు నెలలుగా ఉర్దూ నేర్చుకుంటున్నట్లు లారా రైట్ తెలిపారు. జాతీయ గీతాన్ని పాడటం ఎంతో గౌరవంగా భావిస్తానని.. అందులోని పదాలను, ఉచ్చారణను సరిగ్గా పలకడం కోసం చాలా సమయం కేటాయిస్తానని చెప్పారు.
‘‘ఏ దేశ జాతీయ గీతమైనా పాడేందుకు అవకాశం రావడం ఎంతో గౌరవంగా భావిస్తాను. దాన్ని ఎప్పుడూ సాధారణ విషయంగా తీసుకోను. భారత్, పాకిస్థాన్ జాతీయ గీతాలు నాకు చాలా సవాల్‌తో కూడుకున్నవి. వాటిని పాడమని అడిగినప్పుడు వెంటనే అంగీకరించను. నేను సరిగ్గా పాడగలనని నిర్ధారించుకున్న తర్వాతే అంగీకరిస్తాను’’ అని లారా రైట్ తెలిపారు.
A stunning performance and a beautiful start to this Test series.@thelaurawright sings the national anthem of Pakistan a cappella. pic.twitter.com/zkTiRN60PU
— Test Match Special (@bbctms) August 19, 2026
తాజావార్తలు
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
-
Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
-
Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌కు ముప్పు పొంచి ఉందా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!