Krishna Pandey: ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. టీ10 చరిత్రలో తొలి ఆటగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. ఈ రికార్డ్ గురించి మాట్లాడితే మనకు మొదటగా గుర్తొచ్చేది యువరాజ్ సింగ్. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఈ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్.. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు. అతని తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోపూ కీరన్ పొలార్డ్ ఆ అరుదైన ఫీట్ సాధించాడు. ఇప్పుడు ఓ యువ ఆటగాడు టీ10లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి.. టీ10 చరిత్రలో ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అతని పేరే కృష్ణ పాండే!
ప్రస్తుతం పాండిచ్చేరి టీ10 లీగ్ జరుగుతోంది. పేట్రియాట్స్, రాయల్స్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పేట్రియాట్స్ తరఫున కృష్ణ పాండే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నితీష్ ఠాకూర్ వేసిన ఆరో ఓవర్‌లో.. ఆరు సిక్స్‌లు బాది పాండే విధ్వంసం సృష్టించాడు. కేవలం 19 బంతుల్లోనే ఇతడు 12 సిక్స్‌లు, 2 ఫోర్లతో 83 పరుగులు సాధించాడు. అయినప్పటికీ.. పేట్రియాట్స్ జట్టు 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. నిర్ణీత 10 ఓవర్లలో 157 పరుగులు చేసింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పేట్రియాట్స్.. 5 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగల్గింది.
Also Read
- Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣
He has done the unthinkable! #KrishnaPandey shows what's possible with his heart-stirring hits!
Watch the Pondicherry T10 Highlights, exclusively on #FanCode 👉 https://t.co/GMKvSZqfrR pic.twitter.com/jfafcU8qRW
— FanCode (@FanCode) June 4, 2022
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!