Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kranti Gaud Fine: దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకపై అద్భుత విజయం సాధించిన భారత మహిళల జట్టు టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కప్ గెలిచిన సంతోషంలో ఉన్న యువ పేసర్ క్రాంతి గౌడ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాక్ ఇచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్-1 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెపై చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను క్రాంతి ఖాతాలో చేర్చింది. టీమిండియా పేసర్ తన తప్పును అంగీకరించడంతో ఐసీసీ జరిమానాతో సరిపెట్టింది.
పెవిలియన్‌కు వెళ్లాలంటూ సైగలు:
ఆదివారం (సెప్టెంబర్ 13) ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 183 రన్స్ చేసింది. భారత్ నిర్దేశించిన 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇమేషా దులానిని క్రాంతి గౌడ్ మొదటి ఓవర్లోనే అవుట్ చేసింది. క్రాంతి వేసిన తొలి బంతిని బౌండరీ బాదిన ఇమేషా.. మరో మూడు బంతుల తర్వాత క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో క్రాంతి సంబరాలు చేసుకుంటూ.. ఇమేషా వైపు చూస్తూ పెవిలియన్‌కు వెళ్లాలని చేయితో సైగలు చేసింది. ఇదే ఆమెపై జరిమానాకు కారణమైంది.
Also Read
- IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా:
ఈ చర్య ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.5 పరిధిలోకి వచ్చినట్లు ఐసీసీ పేర్కొంది. ఓ ప్లేయర్ ఔటైన సమయంలో అతడిని కించపరిచేలా లేదా ప్రత్యర్థి బ్యాటర్ నుంచి ప్రతిస్పందన వచ్చేలా భాష, చర్యలు లేదా సైగలను ఉపయోగించడాన్ని ఆర్టికల్ 2.5 కిందికి వస్తుంది. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో క్రాంతి గౌడ్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను మ్యాచ్ రెఫరీ సుప్రియ రాణి దాస్ కేటాయించారు. మ్యాచ్ రిఫరీ ప్రతిపాదించిన శిక్షను కూడా క్రాంతి అంగీకరించడంతో ప్రత్యేక విచారణ అవసరం లేకుండానే చర్యలు పూర్తయ్యాయి. అంపైర్లు సలీమా ఇమ్తియాజ్, షతీరా జాకిర్ జెసీ, థర్డ్ అంపైర్ రోకేయా సుల్తానా, ఫోర్త్ అంపైర్ హుమైరా ఫరా కలిసి క్రాంతిపై అభియోగాలు నమోదు చేశారు.
అధికారిక మందలింపు తప్పనిసరి:
ఐసీసీ నిబంధనల ప్రకారం.. లెవల్-1 ఉల్లంఘనలకు కనీసం అధికారిక మందలింపు, గరిష్ఠంగా ఆటగాడి మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకు జరిమానా విధించవచ్చు. అలాగే ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. గత 24 నెలల్లో క్రాంతి గౌడ్‌కు ఇదే తొలి నేరం కావడంతో.. ఆమె రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ మాత్రమే చేరింది. మరోవైపు పాకిస్థాన్ మహిళల జట్టుపైనా ఐసీసీ చర్యలు తీసుకుంది. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ సెమీఫైనల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధించింది. నిర్ణీత సమయంలో పాకిస్థాన్ ఒక ఓవర్ తక్కువగా వేసినట్లు తేలడంతో ఈ జరిమానా విధించారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో వేయాల్సిన ప్రతి ఓవర్ తక్కువైనందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధిస్తారు.
తాజావార్తలు
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!