Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Kolkata Knight Riders Scored 79 In 10 Overs

KKR vs RCB: గుర్బాజ్ ఒంటరి పోరు.. 10 ఓవర్లకు కేకేఆర్ స్కోరు ఇది

Published Date :April 6, 2023 , 8:31 pm
By NTV WebDesk
KKR vs RCB: గుర్బాజ్ ఒంటరి పోరు.. 10 ఓవర్లకు కేకేఆర్ స్కోరు ఇది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kolkata Knight Riders Scored 79 In 10 Overs: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. కేకేఆర్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి కేకేఆర్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. రెహమానుల్లా గుర్బాజ్ అర్థశతకంతో చెలరేగడంతో.. కేకేఆర్ స్కోరు బోర్డు ముందుకు సాగుతోంది. తొలుత మైదానంలోకి అడుగుపెట్టిన కొద్దిసేపట్లోనే కేకేఆర్‌కు అనూహ్య షాక్‌లు తగిలాయి. నాలుగో ఓవర్‌లోనే కేకేఆర్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్, మన్‌దీప్ సింగ్ బౌల్డ్ అయ్యారు. అనంతరం కేకేఆర్ కెప్టెన్ కూడా ఏడో ఓవర్‌లో పెవిలియన్ చేరాడు.

KKR vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ఆర్సీబీ

ఇలా కేకేఆర్ ఓవైపు వికెట్లు కోల్పోతుండగా.. మరోవైపు గుర్బాజ్ ఒత్తిడికి గురవ్వకుండా, ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. విశేషం ఏమిటంటే.. 47 పరుగుల వద్ద ఇతడు సిక్సర్ బాది, తన అర్థశతకాన్ని పూర్తి చేసుకోవడం. సాధారణంగా హాఫ్ సెంచరీకి దగ్గర్లో ఉన్నప్పుడు చాలామంది ఆటగాళ్లు తడబడతారు. తమ అర్థశతకం పూర్తి చేసుకోవడంలో దృష్టి సారిస్తారు. కానీ.. గుర్బాజ్ మాత్రం సిక్స్ కొట్టి, తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇతడు అద్భుతంగా రాణిస్తుండడం వల్ల.. కష్టాల్లో ఉన్న కేకేఆర్ గట్టెక్కిందని చెప్పుకోవచ్చు.

Japanese military helicopter: జపాన్ సైనిక హెలికాప్టర్ అదృశ్యం.. వారంతా క్షేమమేనా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • KKR vs RCB
  • kolkata knight riders
  • Rahamanulla Gurbaz
  • Royal Challengers Bangalore
  • VIRAT KOHLI

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions