Site icon NTV Telugu

KKR vs GT: ముగిసిన కేకేఆర్ బ్యాటింగ్.. గుజరాత్ లక్ష్యం ఇది!

Kkr Scored 179

Kkr Scored 179

Kolkata Knight Riders Scored 179 Against GT At Eden Gardens: ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ జట్టు 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గుర్బాజ్ సింగ్ (39 బంతుల్లో 81) ఔట్‌స్టాండింగ్‌గా రాణించడం, చివర్లో ఆండ్రూ రసెల్ (19 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. కేకేఆర్ ఈ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ గుజరాత్ జట్టు గెలుపొందాలంటే.. 180 పరుగులు చేయాల్సి ఉంటుంది.

Rinku Singh: రింకూ తప్పకుండా భారత్ తరఫున ఆడుతాడు

తొలుత టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. కేకేఆర్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓవైపు గుజరాత్ బౌలర్ల దెబ్బకు కేకేఆర్ బ్యాటర్లు ముపుతిప్పలు పడుతుంటే.. గుర్బాజ్ ఒక్కడే ఒంటిర పోరాటం కొనసాగించాడు. ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టేలా బౌండరీల మీద బౌండరీలు బాదేశాడు. ఎలాంటి క్లిష్టమైన బంతులు వేసినా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని పరుగుల వర్షం కురిపించాడు. ఓవైపు వికెట్లు పడుతుంటే.. మరోవైపు గుర్బాజ్ ఒత్తిడికి గురవ్వకుండా విధ్వంసం సృష్టించాడు. కేవలం 39 బంతుల్లోనే అతడు 207.69 స్ట్రైక్ రేట్‌తో 81 పరుగులు చేశాడంటే.. ఏ రేంజ్‌లో చెలరేగిపోయాడో అర్థం చేసుకోవచ్చు. టాపార్డర్ అంతా చేతులెత్తేస్తే.. గుర్బాజ్ ఒక్కడే నేనున్నానంటూ జట్టుని ఆదుకున్నాడు. అతని దూకుడు చూసి.. సెంచరీ తప్పకుండా చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. నూర్ అహ్మద్ వేసిన టెంప్టింగ్ బంతికి షాట్ కొట్టి, రషీద్ ఖాన్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

Acharya: ఎందుకు మాస్టారు.. ఆ పాదఘట్టాన్ని మళ్లీ గుర్తుచేసి చంపుతారు

ఈసారి రింకూ సింగ్ త్వరగానే క్రీజులోకి అడుగుపెట్టాడు కానీ, భారీ ఇన్నింగ్స్ మాత్రం ఆడలేకపోయాడు. క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్న అతగాడు.. ఒక భారీ షాట్ కొట్టబోయి, క్యాచ్ ఔట్ అయ్యాడు. బౌండరీ లైన్ వద్ద లిటిల్ అతని క్యాచ్‌ని అద్భుతంగా పట్టుకున్నాడు. ఈ సీజన్‌లో మొదటి నుంచి నిరాశపరుస్తూ వస్తున్న ఆండ్రూ రసెల్.. ఈ మ్యాచ్‌లో మాత్రం మెరుపులు మెరిపించాడు. 19 బంతుల్లోనే రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అయితే.. చివరి బంతికి షాట్ కొట్టబోయి, క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో.. కేకేఆర్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. మరి.. 180 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ఛేధిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Exit mobile version