Site icon NTV Telugu

IND vs SA 2nd ODI: దంచికొట్టిన కోహ్లీ, రుతురాజ్, కేఎల్ రాహుల్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?

Kl

Kl

IND vs SA 2nd ODI: టీమిండియా- దక్షిణాఫ్రికా మధ్య రాయ్‌పుర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి మొదట భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులను చేసింది. అయితే, జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ (14), జైస్వాల్ (22) నిరాశపర్చిన.. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇక, గైక్వాడ్ 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు (శతకం) చేయగా, కోహ్లీ 93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 రన్స్ (సెంచరీ) చేశాడు. కాగా, రుతురాజ్‌కి ఇది తొలి సెంచరీకాగా.. విరాట్‌ కోహ్లీకి ఈ సిరీస్‌లో రెండో శతకం.

Read Also: Rajnath Singh: నెహ్రూ ప్రజా ధనంతో “బాబ్రీ మసీదు”ను నిర్మించాలనుకున్నారు.. కాంగ్రెస్ ఫైర్..

అయితే, చివర్లో టీమిండియా కెప్టెన్ కేఎల్ చెలరేగి ఆడటంతో జట్టు భారీ స్కోర్ సాధించింది. రాహుల్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 66 పరుగులు చేయగా.. రవీంద్ర జడేజా 24 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక, ఆలౌ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (1) మాత్రం తీవ్రంగా నిరాశపర్చాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీసుకోగా, నాంద్రే బర్గర్, లుంగీ ఎంగిడి తలో వికెట్ పడగొట్టాడు. కాగా, దక్షిణాఫ్రికా 359 పరుగుల టార్గెట్ ను ఛేదించాల్సి ఉంది.

URL

Exit mobile version