IND vs SA 2nd ODI: భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు సెకండ్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 రన్స్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (22), రోహిత్ శర్మ (14) తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టిన వేళ.. రుతురాజ్ గైక్వాడ్ ( 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు), విరాట్ కోహ్లీ (93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 పరుగులు) అద్భుతమైన సెంచరీలతో చెలరేగి జట్టుకు భారీ స్కోరు అందించారు. రుతురాజ్ కు వన్డేల్లో ఇది ఫస్ట్ తొలి శతకం కావడం విశేషం. అయితే, చివరల్లో కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 పరుగులు నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రవీంద్ర జడేజా (24 నాటౌట్) రన్స్ చేశాడు. సఫారీ జట్టు బౌలర్లలో మార్కో యాన్సెన్ 2, నంద్రీ బర్గర్, లుంగి ఎంగిడి తలో వికెట్ తీసుకున్నారు.
Read Also: Rajnath Singh: నెహ్రూ ప్రజా ధనంతో “బాబ్రీ మసీదు”ను నిర్మించాలనుకున్నారు.. కాంగ్రెస్ ఫైర్..
అయితే, హాఫ్ సెంచరీ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ దూకుడు పెంచేశాడు. కేశవ్ మహరాజ్ వేసిన 28 ఓవర్‌లో గైక్వాడ్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టాడు. అనంతరం బాష్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి శతకానికి చేరువయ్యాడు. ఆ తర్వత సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే రుతురాజ్ ఔట్ అయ్యాడు. అలాగే, 90 బంతుల్లో సెంచరీ చేసిన కోహ్లీ.. కొద్దిసేపటికే పెవిలియన్ బాట పట్టాడు. విరాట్, రుతురాజ్ 3వ వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ (1) రనౌట్ కావడంతో.. చివర్లో కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడి 33 బంతుల్లో అర్థ శతకం చేశాడు.
Klassy and stylish! 😎#TeamIndia finish the innings on a high 🙌
Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#INDvSA | @IDFCFIRSTBank | @klrahul pic.twitter.com/NCfZdISnt2
— BCCI (@BCCI) December 3, 2025