KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీలు బాదడం అనేది ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన రికార్డు. తాజాగా సరికొత్త రికార్డులతో టీమిండియా ఓపెనర్లు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం భారత్ , ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ కె.ఎల్. రాహుల్ అద్భుతమైన సెంచరీతో (100 పరుగులు) కదం తొక్కాడు. ఈ సెంచరీతో టెస్ట్ ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ 203 ఇన్నింగ్స్‌ల్లో అత్యధికంగా 33 సెంచరీలు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. తన దూకుడైన ఆటతీరుతో టెస్ట్ క్రికెట్ స్వరూపాన్నే మార్చేసిన వీరేంద్ర సెహ్వాగ్ 168 ఇన్నింగ్స్‌ల్లో 22 సెంచరీలు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక క్లాసిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్న మురళీ విజయ్ 100 ఇన్నింగ్స్‌ల్లో 12 సెంచరీలు చేసి మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న రాహుల్ ఈ మ్యాచ్‌తో కలిపి 101 ఇన్నింగ్స్‌ల్లో 11 సెంచరీలు పూర్తి చేసుకుని మురళీ విజయ్ రికార్డుకు కేవలం ఒకే ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు.
Also Read
- RCB: రిటెన్షన్ తర్వాత ఆర్బీసీ పరిస్థితి ఇదీ.. ఎవరున్నారు..? ఎవరు వెళ్లారు..?
- IPL 2027: పూర్తయిన రిటెన్షన్ ప్రక్రియ.. ఎవరి పర్సులో ఎంత..? టాప్‌లో LSG..
- IPL 2027 Retention List: వేలానికి సిద్ధమైన స్టార్లు.. కోట్లు పలికిన ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు.. లిస్ట్ ఇదే..
- IPL Retention: లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి సామ్ కర్రన్.. DC నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఔట్..
న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ లో గల మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. ఓపెనర్ రాహుల్ 165 బంతుల్లో 11 ఫోర్లతో 100 పరుగులు చేసి అవుట్ అవ్వగా, సాయి సుదర్శన్ (81 పరుగులు) రాణించాడు. ప్రస్తుతం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 59 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కె.ఎల్. రాహుల్ సాధించిన ఈ సెంచరీ అతనికి ఓపెనర్‌గా మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!