Site icon NTV Telugu

KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్సీ రికార్డు అద్భుతం.. విజయ శాతం తెలిస్తే మైండ్ బ్లాకే!

Kl Rahul Captain Record

Kl Rahul Captain Record

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాహుల్ టీమిండియాను నడిపించనున్నాడు. మెడ నొప్పితో బాధపడుతున్న రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ స్థానంలో రాహుల్‌ను బీసీసీఐ నియమించింది. రాహుల్ గతంలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మూడు ఫార్మాట్లలో సారథిగా చేశాడు. మరోసారి కెప్టెన్సీని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.

కేఎల్ రాహుల్‌కు పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేదు కానీ.. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టును నడిపించాడు. ఈ సీనియర్ ఆటగాడు గత కొన్ని సంవత్సరాలుగా వన్డేల్లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాదు కెప్టెన్సీ ఇచ్చినప్పుడల్లా విజయవంతమయ్యాడు. ఆటగాడిగా కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. రాహుల్ నాయకత్వ రికార్డును ఓసారి చూద్దాం. రాహుల్ ఇప్పటివరకు మొత్తం 12 వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఇందులో ఎనిమిది వన్డేల్లో గెలిచిన భారత్.. నాలుగు ఓడిపోయింది. రాహుల్ విజయ శాతం 66గా ఉంది.

Also Read: Smriti Mandhana-Palak: షాకింగ్ న్యూస్.. స్మృతి మంధానని మోసం చేసిన పలాశ్‌, స్క్రీన్‌షాట్‌లు వైరల్‌

మూడు టెస్ట్ మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్‌ నాయకత్వం వహించాడు. ఇందులో భారత్ రెండు గెలవగా, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఒక టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. రాహుల్ తన కెప్టెన్సీలో 10 ఇన్నింగ్స్‌ల్లో 33.55 సగటుతో 302 పరుగులు చేశాడు. రాహుల్ కెప్టెన్సీలో జింబాబ్వే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాపై సిరీస్‌లను భారత్ గెలుచుకుంది. ఆసక్తికరంగా భారత వన్డే కెప్టెన్‌గా అతని తొలి మ్యాచ్ 2022 పర్యటనలో దక్షిణాఫ్రికాపై ఆడాడు. రాహుల్ 88 వన్డేల్లో 48.31 సగటుతో 3092 పరుగులు చేశాడు. ఇందులో 18 అర్ధ సెంచరీలు, ఏడు సెంచరీలు ఉన్నాయి.

 

Exit mobile version