Asia Cup: హాంకాంగ్‌తో మ్యాచ్ నుంచి కేఎల్ రాహుల్‌ను తప్పిస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup: ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై అదరగొట్టిన టీమిండియా రెండో మ్యాచ్‌లో బుధవారం నాడు హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్ టీమిండియానే అయినా హాంకాంగ్‌ను తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే అవుతుంది. గ్రూప్-బిలో ఆప్ఘనిస్తాన్ అదరగొట్టే రీతిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. అదే విధంగా గ్రూప్-ఎలో హాంకాంగ్ సంచలనాలు నమోదు చేయాలని ఆరాటపడుతోంది. గతంలో ఆసియా కప్‌లో 2008లో, 2018లో హాంకాంగ్‌తో ఇండియా తలపడింది. ఆ రెండు సార్లు ఇండియానే గెలిచింది.
అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాలో తుది జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేలవ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, అవేష్ ఖాన్‌లను ఈ మ్యాచ్‌లో పక్కనపెడతారని ప్రచారం జరుగుతోంది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కారణంగా లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మన బ్యాటర్లకు ఇబ్బంది ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ స్థానంలో.. రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకునే వీలుంది. దీంతో రోహిత్, పంత్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. గత మ్యాచ్‌లో పర్వాలేదనిపించేలా ఆడిన కోహ్లీ కీలక సమయంలో 35 పరుగులు చేయడంతో అతని బెర్త్ ఖాయంగా ఉంది. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. పంత్ తుది జట్టులో ఉంటే జడేజా ఎప్పటిలాగే తన 6వ స్థానంలో బరిలోకి దిగుతాడు. 5వ స్థానంలో పాకిస్థాన్ మ్యాచ్ హీరో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు. అటు అవేష్ ఖాన్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు భారత్ ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో హాంకాంగ్‌తో మ్యాచ్‌లో బరిలో దిగనుంది.
Also Read
- R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
- Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
- Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
తాజావార్తలు
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!