IPL Retentions 2027: నరైన్ కోసం టాప్ ట్రేడ్.. ఆర్ఆర్ ఆఫర్‌ను తిరస్కరించిన కేకేఆర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆటగాళ్ల ట్రేడింగ్ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌ను తమ జట్టులోకి తీసుకోవాలని రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ప్రయత్నించినట్లు సమాచారం. నరైన్ కోసం యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో పాటు మరో ఆటగాడిని బదులుగా ఇచ్చేందుకు రాజస్థాన్ ప్రతిపాదించినట్లు స్పోర్ట్స్ టాక్ కథనం వెల్లడించింది. అయితే ఈ ట్రేడ్ ఆఫర్‌ను కేకేఆర్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
సునీల్ నరైన్‌ను జట్టులోకి తీసుకురావాలని తొలుత రాజస్థాన్ రాయల్స్ భావించిందని సదరు నివేదిక పేర్కొంది. అయితే తమ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న నరైన్‌ను వదులుకోవడానికి కేకేఆర్ ఆసక్తి చూపలేదట. నరైన్‌కు బదులుగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను తీసుకోవాలని కేకేఆర్ సూచించినట్లు సమాచారం. కానీ గ్రీన్ ఫిట్నెస్, అందుబాటుపై ఉన్న సందేహాల కారణంగా రాజస్థాన్ ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని తెలుస్తోంది. 2027లో ఆస్ట్రేలియా బిజీ అంతర్జాతీయ షెడ్యూల్ కూడా దీనికి ఓ కారణంగా నివేదిక పేర్కొంది. ఆ తర్వాత మరో ప్రతిపాదనతో రాజస్థాన్ ముందుకొచ్చినట్లు సమాచారం. జైస్వాల్‌కు బదులుగా యువ బ్యాటర్ అంక్రిష్ రఘువంశీని తీసుకునే అవకాశం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను కూడా కేకేఆర్ తిరస్కరించిందని నివేదిక పేర్కొంది. ఐపీఎల్ 2026లో నిరాశాజనక ప్రదర్శన చేసినప్పటికీ, జట్టుకు సానుకూలాంశంగా నిలిచిన కొద్దిమంది ఆటగాళ్లలో రఘువంశీ ఒకడిగా ఉన్నాడు.
Also Read
- IPL Retentions 2027: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027కు ఇద్దరు స్టార్స్ దూరం.. ఇక అంతే సంగతులు!
- IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
- IPL 2027 Retention Live: రిటెన్షన్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారు?.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
- Lakshya Raichandani: ఆ ఐపీఎల్ టీమ్‌లో ఆడడమే నా టార్గెట్.. మనసులో మాట చెప్పేసిన అండర్-19 కెప్టెన్!
యశస్వి జైస్వాల్‌తో ఏడేళ్ల అనుబంధానికి ముగింపు పలకడానికి రాజస్థాన్ సిద్ధంగా ఉందనే చర్చ కూడా ఈ ట్రేడ్ వార్తతో మొదలైంది. ఇప్పటివరకు రాజస్థాన్ తరఫున 2,500కు పైగా పరుగులు చేసిన జైస్వాల్.. ఐపీఎల్లో అత్యంత ప్రతిభావంతమైన యువ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అతడిని వదులుకోవడం రాజస్థాన్‌కు పెద్ద నిర్ణయమే అవుతుంది. మరోవైపు కేకేఆర్‌కు జైస్వాల్ వస్తే ఫిన్ అలెన్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రహానే రిటైర్మెంట్ తర్వాత జట్టుకు నాయకత్వం వహించగల భారత ఆటగాడిగా కూడా జైస్వాల్‌ను పరిగణించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇక నరైన్ కేకేఆర్‌కు ఎంతో కీలకమైన ఆటగాడు. 2012 నుంచి ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. కేకేఆర్ మూడు ఐపీఎల్ టైటిళ్లు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే అతడిని వదులుకోవడం కంటే కెరీర్ ముగిసిన తర్వాత కూడా కేకేఆర్‌తోనే కొనసాగిస్తూ కోచింగ్ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన ఫ్రాంచైజీకి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
IPL Retentions 2027: నరైన్ కోసం టాప్ ట్రేడ్.. ఆర్ఆర్ ఆఫర్‌ను తిరస్కరించిన కేకేఆర్!
-
Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!
-
క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ దందా.. ఇద్దరి అరెస్ట్.!
-
Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S కు భారత్ NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. 7 సీటర్ SUVలో సరికొత్త రికార్డు!
-
Sammakka Sagar Barrage: సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరలోనే ఎన్ఓసీ.. సీఎం రేవంత్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం హామీ..!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..