IPL 2022: విలియమ్సన్ అవుట్‌పై దుమారం.. బీసీసీఐకి SRH లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 210/6 స్కోర్ చేయగా.. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుటైన విధానంపై దుమారం రేగుతోంది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో విలియమ్సన్ క్యాచ్ అవుట్ అయ్యాడని థర్డ్ అంపైర్ ప్రకటించాడు. అయితే ఈ క్యాచ్ గ్రౌండ్‌ను తాకిందని సన్‌రైజర్స్ టీమ్ వాదిస్తోంది.
అసలు ఏం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ విసిరిన హైపిచ్ బంతిని విలియమ్సన్ డిఫెన్స్ చేశాడు. అయితే బంతి కుడివైపు స్లిప్స్‌లో గాల్లోకి ఎగిరింది. వికెట్ కీపర్ సంజు శాంసన్ కుడివైపు డైవ్ చేసినప్పటికీ బంతిని అందుకోలేకపోయాడు. తొలుత అతిన గ్లోవ్స్‌లో పడి మళ్లీ గాల్లోకి లేచిన బంతిని స్లిప్స్‌లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. అతడి చేతుల్లోకి వెళ్లకముందే ఆ బంతి గ్రౌండ్‌ను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడాన్ని సన్‌రైజర్స్ టీమ్ ఖండించింది. తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ బీసీసీఐకి లేఖ రాసింది. థర్డ్ అంపైర్ నిర్ణయం సరికాదని స్పష్టం చేసింది. తాము లేఖ రాసిన విషయాన్ని సన్‌రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూడీ వెల్లడించాడు.
Also Read
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
- Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
https://ntvtelugu.com/kolkata-knight-riders-won-by-4-wickets-against-punjab-kings/
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!