Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joshna Chinappa Asian Games Record: భారత స్క్వాష్ స్టార్ జోష్నా చినప్ప అరుదైన ఘనత సాధించింది. వరుసగా ఏడోసారి ఏషియన్ గేమ్స్‌లో ఆడుతున్న జోష్నా.. ఈసారి కూడా పతకాన్ని ఖాయం చేసుకుంది. 40వ పుట్టినరోజు జరుపుకున్న పది రోజులకే.. వెలవన్ సెంథిల్‌కుమార్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్‌కు చేరి పతకాన్ని ఖరారు చేసుకుంది. దీంతో ఏషియన్ గేమ్స్‌లో జోష్నా ఖాతాలో ఆరో పతకం చేరనుంది. 2002 బుసాన్ ఏషియన్ గేమ్స్‌లో తొలిసారి బరిలోకి దిగిన జోష్నా.. తాజాగా ఏడోసారి ఆసియా క్రీడల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో ఆరు ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారత స్క్వాష్ దిగ్గజం సౌరవ్ ఘోషల్ రికార్డును ఆమె అధిగమించింది. సౌరవ్ గతేడాది రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇంత సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించడానికి తన కఠినమైన శిక్షణ, ధ్యానం, శ్వాసాభ్యాసాలే కారణమని జోష్నా చినప్ప చెబుతోంది. ‘రోజుకు ఐదు నుంచి ఆరు గంటల పాటు వివిధ సెషన్లలో శిక్షణ తీసుకుంటా. వారానికి ఐదు లేదా ఆరు రోజుల పాటు క్రమం తప్పకుండా సాధన చేస్తా. ఏడో ఆసియా క్రీడల్లో ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి వరకు వస్తానని నేను కూడా అనుకోలేదు. ఇప్పటికీ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండి భారత్ తరఫున ఆడుతున్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. నేను ఒక్కో రోజును మాత్రమే దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నా’ అని జోష్నా చెప్పింది.
Also Read
- India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
- Asian Games 2026 Shooting: ఏషియన్ గేమ్స్ 2026లో భారత షూటర్ల హవా.. స్వర్ణంతో మెరిసిన కమల్జీత్- సురుచి
- Suchika Tariyal: ఆ రోజు జరిగిన అవమానమే.. ఈ రోజు దేశం గర్వించే పతకంగా మారింది! సుచికా గూస్బంప్స్ స్టోరీ!
- IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
తన భవిష్యత్తుపై దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవడం లేదని జోష్నా చినప్ప స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం భారత్ తరఫున ఆడటం, ఆసియా క్రీడల్లో పాల్గొనడంపైనే నా దృష్టి ఉంది. భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై ఇప్పటివరకు ఆలోచించలేదు. నా సుదీర్ఘ కెరీర్‌కు నాతో కలిసి పనిచేస్తున్న టీమ్ కూడా ఎంతో కీలకం. నా వెనుక ఓ పెద్ద టీమ్ ఉంది. ఫిట్నెస్ ట్రైనర్, సైకాలజిస్ట్, కోచ్‌తో పాటు న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ వంటి పలువురు నాకు సహకరిస్తున్నారు. పోషకాహారం విషయంలోనూ అందరూ సహాయం చేస్తున్నారు. ప్రతిరోజూ ఆడేందుకు వాళ్లంతా నాకు అండగా ఉంటారు. నేను ధ్యానం చేస్తాను. శ్వాసాభ్యాసాలు కూడా చేస్తాను’ అని జోష్నా వివరించింది.
మిక్స్డ్ డబుల్స్‌లో తాజాగా ఖరారైన పతకంతో ఆసియా క్రీడల్లో జోష్నా చినప్ప పతకాల సంఖ్య ఆరుకు చేరనుంది. ఇప్పటికే ఆమె రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించింది. 2018లో సింగిల్స్‌లో కాంస్యం గెలిచిన జోష్నా.. 2014, 2018లో టీమ్ ఈవెంట్లో రజతాలు సాధించింది. 2010, 2022 ఆసియా క్రీడల్లో టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలను అందుకుంది. అయితే ఆమె పతకాల క్యాబినెట్లో ఆసియా క్రీడల స్వర్ణం మాత్రం ఇంకా లేదు. ప్రపంచ ఛాంపియన్షిప్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో వివిధ విభాగాల్లో స్వర్ణాలు గెలిచిన జోష్నా.. ఆసియా క్రీడల్లోనూ బంగారు పతకం సాధించాలని కోరుకుంటోంది.
‘ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలవడం చాలా కష్టం. ప్రపంచంలోని అత్యుత్తమ స్క్వాష్ ప్లేయర్లలో చాలామంది ఆసియా నుంచే వస్తారు. ఒలింపిక్స్ తర్వాత స్క్వాష్‌కు ఆసియా క్రీడలు అత్యంత కఠినమైన పోటీల్లో ఒకటి. అందుకే ఇక్కడ స్వర్ణం గెలవడం చాలా ప్రత్యేకం. కానీ ప్రస్తుతం ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెడుతున్నా’ అని జోష్నా చెప్పింది. వయసు పెరిగేకొద్దీ తన శిక్షణ విధానంలోనూ చాలా మార్పులు చేసుకున్నట్లు జోష్నా వెల్లడించింది. ‘వయసు పెరిగేకొద్దీ శరీరం గతంలో మాదిరిగా ఉండదు. 35 ఏళ్లు దాటిన తర్వాత నా శిక్షణను చాలా మార్చుకున్నా. ఇప్పుడు చాలా నియంత్రిత విధానంలో ట్రైనింగ్ చేస్తున్నా. జిమ్‌లో బలాన్ని పెంచుకునే వ్యాయామాలు చేస్తున్నా. తదుపరి సెషన్‌కు నా శరీరం సిద్ధంగా ఉండేలా చూసుకుంటున్నా. గతంలో ఉన్నంత వేగంగా శరీరం కోలుకోదు. అయితే నేను చిన్న వయసులో ఉన్నప్పటి కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆడేందుకు మరింత శ్రమ అవసరం’ అని జోష్నా పేర్కొంది.
గతేడాది అక్టోబర్‌లో చివరిసారిగా PSA సింగిల్స్ టైటిల్ గెలిచిన జోష్నా.. ఇకపై కూడా సింగిల్స్‌లో కొనసాగుతానని స్పష్టం చేసింది. డబుల్స్‌లో తాను ప్రధానంగా ఆసియా క్రీడలు, ఇతర ప్రత్యేక ఈవెంట్లలో మాత్రమే బరిలోకి దిగుతానని చెప్పింది. ‘నేను ఇప్పటికీ సింగిల్స్ ఆడుతున్నా. డబుల్స్‌లో ప్రధానంగా గేమ్స్ సమయంలోనే ఆడతాం. ప్రపంచ డబుల్స్ కూడా జరుగుతాయి కానీ చాలా కాలంగా అది జరగలేదు. కాబట్టి నేను ప్రధానంగా సింగిల్స్ ప్లేయర్‌నే. పతకం కోసం కలిసి ఆడే సందర్భాల్లో మాత్రమే డబుల్స్‌పై దృష్టి పెడతాం’ అని వివరించింది. ‘స్క్వాష్ ఎట్టకేలకు ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకోవడం అద్భుతం. భారత్‌లో ప్రస్తుతం ఎంతో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్ల బృందం ఉంది. వారిలో చాలామంది 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే సామర్థ్యం కలిగి ఉన్నారు. మరో రెండేళ్లలో వారు మరింత బలంగా, తమ కెరీర్లో అత్యుత్తమ స్థాయికి చేరుకుంటారు. వారిలో ఎవరో ఒకరు భారత్‌కు ఒలింపిక్ పతకం సాధించగలరని నేను కచ్చితంగా నమ్ముతున్నా’ అని జోష్నా పేర్కొంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!