Site icon NTV Telugu

Joe Root Saves Hayden: సెంచరీ చేయకపోతే నగ్నంగా నడుస్తా.. హేడెన్ ఇజ్జత్ కాపాడిన రూట్

Heden

Heden

Joe Root Saves Hayden: యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ 12 ఏళ్ల తర్వాత శతకం కొట్టాడు. దీంతో రూట్‌కు ఆస్ట్రేలియాలో ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే మొదటి సెంచరీ. అతడు ప్రస్తుతం 135 రన్స్ తో అజేయంగా క్రీజులో కొనసాగుతున్నాడు.అయితే, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ తన సెంచరీతో ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్ ‌ను న్యూడ్ రన్ నుంచి రక్షించాడు.

Read Also: Airtel Annual Plan: ఏడాది వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్.. రూ. 2,249కే.. బెనిఫిట్స్ ఇవే

కాగా, ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు ముందు జో రూట్‌ మీదపై ఒత్తిడి తెచ్చేలా మాథ్యూ హేడెన్ ఓ సవాల్ విసిరాడు. ఈ పర్యటనలో అతడు సెంచరీ చేయకపోతే మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో నగ్నంగా నడుస్తానని ఛాలెంజ్ చేయగా.. దానికి స్పందిచిన హెడెన్‌ కూతురు గ్రేస్ హేడెన్ ‌.. ప్లీజ్ రూట్ సెంచరీ చేసి మా నాన్న ఇజ్జత్ కాపాడు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు రూట్ నిజంగానే శతకం కొట్టి హెడెన్‌ ‌ను సేవ్ చేశాడు.

Read Also: Telangana Rising Global Summit : హైదరాబాద్‌కి వస్తున్న సల్మాన్.. అజయ్.! పెద్ద ప్లానింగే..!

అయితే, గత 12 ఏళ్లుగా ఆస్ట్రేలియా గడ్డపై జో రూట్ సెంచరీ కోసం పోరాటం చేస్తున్నాడు. ఇంతకు ముందు వరకు ఆసీస్‌లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ కేవలం 89గా మాత్రమే ఉంది. ఎట్టకేలకు శతకాన్ని అందుకుని తన సుదీర్ఘ నిరీక్షణను నెరవేర్చుకున్నాడు. జో రూట్ సెంచ‌రీ చేయ‌గానే హేడెన్ కామెంట‌రీ బాక్స్ నుంచి బ‌య‌ట‌కు సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లెజెండ్‌ను ఈ సందర్భంగా అభినందించాడు. చాలా సంవత్సరాల త‌ర్వాత నీవు అనుకున్న ల‌క్ష్యానికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది అని హేడెన్ పేర్కొన్నాడు.

Exit mobile version