Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Root on LBW Dismissals: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన బ్యాటింగ్ టెక్నిక్‌పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాడు. ఇటీవల వరుసగా లెగ్ బిఫోర్ వికెట్ (ఎల్బీడబ్ల్యూ)గా ఔటవుతున్న రూట్.. ఈ సమస్యను తాను తప్పకుండా అధిగమిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. దాదాపు 15 ఏళ్లుగా అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడుతూ 14 వేలకు పైగా టెస్టు పరుగులు చేసిన తన అనుభవమే ఇందుకు నిదర్శనమని చెప్పాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ రూట్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా ఎనిమిది సార్లు ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ టెస్టు సిరీస్‌లో ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఆరు సార్లు ఇదే విధంగా ఔటయ్యాడు.
వరుసగా జో రూట్ ఎల్బీడబ్ల్యూగా ఔటవుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడు స్పందించాడు. వరుసగా ఎల్బీడబ్ల్యూగా అసహనానికి గురిచేస్తున్నప్పటికీ.. సమస్యను పరిష్కరించుకునే సామర్థ్యం తనకు ఉందని స్పష్టం చేశాడు. ‘నేను ఆటను చాలా కాలంగా ఆడుతున్నాను. ఇలాంటి సమస్యలు ఎదురైన ప్రతిసారీ వాటిని పరిష్కరించుకునే మార్గాలను కనుగొన్నాను. ఎల్బీడబ్ల్యూ విషయంలో కూడా అలానే అధిగమిస్తాను. నేను 14 వేల పరుగులు ఎలా చేశాను?, దాదాపు 15 ఏళ్లుగా ఈ స్థాయిలో ఎందుకు ఆడుతున్నాను? అందుకు ఒక కారణం ఉంది’ అని బీబీసీతో రూట్ చెప్పాడు.
Also Read
- Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
తరచూఎల్బీడబ్ల్యూగా ఔటవుతుండటం తనను ఇబ్బంది పెడుతోందని జో రూట్ అంగీకరించాడు. అయితే కొన్ని సందర్భాల్లో అంపైర్ కాల్స్ కూడా తనకు అనుకూలంగా లేవని పేర్కొన్నాడు. ‘ఒకే రీతిలో అవుట్ అవ్వడం తీవ్ర నిరాశ కలిగిస్తోంది. అంపైర్ కాల్స్ కూడా నేను అవుట్ అవవడానికి ఓ రీజన్. సుమారు నాలుగు నాకు వ్యతిరేకంగా వచ్చాయి. గతంలోకంటే ప్రస్తుతం బంతిఎక్కువగా మారుతున్నట్లు అనిపిస్తోంది. పరిస్థితిని వాస్తవికంగా అర్థం చేసుకుంటూనే.. ఎక్కడ మెరుగుపడాలో గుర్తించాలి. నేను ఈ దశను కూడా దాటిపోతాననే నమ్మకం ఉంది. దాని గురించి నేను పెద్దగా ఆందోళన చెందడం లేదు’ అని రూట్ అన్నాడు.
పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో బ్యాటర్లకు ఇబ్బందులు పెరగడానికి కొత్త డ్యూక్స్ బంతి కూడా ఒక కారణమని జో రూట్ అభిప్రాయపడ్డాడు. ‘ఈ ఏడాది బంతులు గతంలో కంటే చాలా భిన్నంగా ఉన్నాయి. వాటి లాకర్లో కూడా ఏదో తేడా ఉన్నట్లు అనిపిస్తోంది. దీనికి నా వద్ద ఆధారాలు లేవు. డ్యూక్స్‌ను అడగాల్సి ఉంటుంది. సీమ్‌పై వేరే రకం లాకర్ ఉన్నట్లు అనిపిస్తోంది. బంతి త్వరగా ఆకారాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నారేమో’ అని రూట్ వివరించాడు. లార్డ్స్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ పేసర్లు అద్భుతంగా రాణించి జట్టుకు ఘన విజయం అందించారు.
తాజావార్తలు
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!