Site icon NTV Telugu

IPL Mega Auction: అండర్-19 ఆటగాళ్లకు జాక్‌పాట్

ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఐపీఎల్ మెగా వేలంలో జాక్‌పాట్ తగిలింది. అండర్‌-19 టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు దక్కించుకుంది. అటు ఆల్‌రౌండర్ రాజ్ బవాను పంజాబ్ కింగ్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. రాజ్ బవా మీడియం పేస్ బౌలింగ్ వేయగలడు. అంతేకాకుండా మిడిల్ ఓవర్లలో పరిస్థితులకు అనుకూలంగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అందుకే పంజాబ్ కింగ్స్ అతడిని రూ.2 కోట్లకు దక్కించుకుంది.

అండర్-19 టీమిండియాకు చెందిన మరో ఆల్ రౌండర్ రాజ్ వర్ధన్ హంగార్గేకర్‌ను రూ.1.5 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ చేజిక్కించుకుంది. హంగార్గేకర్ టీనేజ్ వయసులోనే స్పీడ్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వేగంగా బంతులు విసరడమే కాకుండా ఇన్నింగ్స్ చివర్లో బ్యాట్‌తోనూ విరుచుకుపడే సత్తా అతడి సొంతం. అందుకే అతడిని చెన్నై జట్టు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల అండర్-19 క్రికెట్‌లో రాణించిన జూనియర్ క్రికెటర్లకు ఐపీఎల్ వేలం మొత్తానికి కలిసొచ్చిందనే చెప్పాలి.

Exit mobile version