Site icon NTV Telugu

India Vs Pakistan: జాతీయ పతాకాన్ని తీసుకునేందుకు నిరాకరించిన జై షా.. ఫ్యాన్స్ ఫైర్

Jay Shah

Jay Shah

India Vs Pakistan: జై షా.. బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్.. అంతకు మించి కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా కుమారుడు. దుబాయ్‌ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కనిపించిన ఓ దృశ్యం.. ఇప్పుడు కొత్తగా వివాదాలకు కేంద్రబిందువు అయింది. జై షా చుట్టూ వివాదాలు ఇప్పుడిప్పుడే ముసురుకుంటోన్నాయి. దీనికి సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని ఆయన ఎదుర్కొనక తప్పక పోవచ్చు. బీసీసీఐ కార్యదర్శిగా ఆయన వివరణ ఇవ్వాల్సిందేనంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన వైఖరిని తప్పుపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి దాయాదుల మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఆసియా కప్‌ టీ-20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో భారత్‌ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు సెలబ్రిటీలే కాక చాలా మంది అభిమానులు దుబాయ్‌ వెళ్లారు. వీరిలో అమిత్‌ షా కుమారుడు జై షా కూడా ఉన్నారు. ఇక పాకిస్థాన్‌పై విజయం అనంతరం స్టేడియంలో ఉన్న భారతీయ అభిమానులు ఆనందోత్సాహాల మధ్య చప్పట్లు కొడుతూ.. తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జాతీయా జెండాను పట్టుకుని అభివాదం చేశారు.

Mukesh Ambani: దుబాయ్‌లో అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన ముకేష్ అంబానీ!

ఈ క్రమంలో ఓ వ్యక్తి జై షాకు జాతీయ జెండా తీసుకెళ్లి ఇవ్వగా అతడు దాన్ని పట్టుకోవడానికి నిరాకరించాడు. నో చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలయ్యింది. ఇది చూసిన నెటిజన్లు మొన్నటి వరకు హర్‌ ఘర్‌ తిరంగా అంటూ ప్రతి భారతీయుడు ఇంటి మీద జెండాను ఎగురవేసి దేశంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కేంద్ర మంత్రి కుమారుడివైన నువ్వు.. జెండా పట్టుకోవడానికి నిరాకరించావు.. ఇదేనా నీ దేశభక్తి.. సంస్కారం అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. జై షా వైఖరిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఆయనను ట్రోల్ చేస్తోన్నారు. తిరంగాను తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడట్లేదంటూ నిలదీస్తోన్నారు. ఇదేనా మీ దేశభక్తి అంటూ నిలదీస్తోన్నారు. ప్రతి ఇంటి మీదా జాతీయ జెండాను ఎగువేయాలంటూ సలహాలను మాత్రం ఇస్తారు.. తాము మాత్రం దీన్ని పాటించరంటూ ధ్వజమెత్తుతున్నారు. విపక్షాలు కూడా దీనిపై మండిపడుతున్నాయి. ఈ వీడియోను షేర్‌ చేస్తూ ఇదే దేశభక్తి అంటూ నిలదీస్తున్నారు.

Exit mobile version