Bumrah ICC Finals Stats: ఐసీసీ ఫైనల్స్‌లో ‘బౌలింగ్ కింగ్’.. ఒత్తిడిలోనూ క్లాస్ చూపించిన జస్ప్రీత్ బుమ్రా!
- భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్
- ఐసీసీ ఫైనల్స్‌లో 'బౌలింగ్ కింగ్' బుమ్రా
- ఒత్తిడిలోనూ క్లాస్ చూపించిన బుమ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah’s ICC Finals Stats యార్కర్ కింగ్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన ప్రత్యేకమైన బౌలింగ్‌తో ఎన్నోసార్లు భారత జట్టుకు కీలక విజయాలు అందించాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో అద్భుత బౌలింగ్ చేశాడు. అందులోనూ ఫైనల్ మ్యాచ్‌ల వంటి అత్యంత ఒత్తిడితో కూడిన సందర్భాల్లో కూడా బాధ్యతాయుతంగా బౌలింగ్ చేసి తన క్లాస్ నిరూపించాడు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో బుమ్రా బౌలింగ్ గణాంకాలు చూస్తే.. అతని బౌలింగ్ ప్రభావం మ్యాచ్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ జరగనుంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఐసీసీ స్టాట్స్ ఓసారి చూద్దాం.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా ఆడాడు. అప్పుడప్పుడే కెరీర్ ఆరంభించిన బుమ్రా 9 ఓవర్లు బౌలింగ్ చేసి 68 పరుగులు ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినా భారత బౌలింగ్ దళంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్ అశ్విన్, ఆర్ జడేజా కంటే బాగా బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏకంగా 180 పరుగుల తేడాతో గెలిచింది.
Also Read
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
- Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
- Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
2023 వన్డే వరల్డ్ కప్:
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన స్పెల్ వేశాడు. 9 ఓవర్లలో కేవలం 43 పరుగులు మాత్రమే ఇచ్చి.. 2 కీలక వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో బూమ్ బూమ్ కట్టుదిట్టమైన బౌలింగ్ ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తీసుకొచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 240 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆసీస్ 43 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
2024 టీ20 వరల్డ్ కప్:
ఇక 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి.. 2 వికెట్లు పడగొట్టాడు. టీ20 ఫార్మాట్లో ఇది బెస్ట్ బౌలింగ్ స్పెల్‌లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ విజయం సాధించింది.
ఫైనల్లీ:
మొత్తంగా చూస్తే.. ఐసీసీ ఫైనల్స్‌లో బుమ్రా ఎప్పుడూ జట్టుకు నమ్మకమైన బౌలర్‌గా నిలిచాడు. కీలక మ్యాచ్‌ల్లో అతని నియంత్రణ, యార్కర్లు, స్లోయర్ బంతులు ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందులకు గురిచేశాయి. అందుకే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో బుమ్రా ఒకడిగా గుర్తింపు పొందాడు.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!