Ravindra Jadeja: గాయం నుంచి కోలుకున్న జడేజా.. కెప్టెన్‌గా రీఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. నేషనల్ టీమ్‌లోకి రావడానికి ముందు ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు తొలుత రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు. అంతేకాదు వచ్చీ రాగానే కెప్టెన్ కూడా అయిపోయాడు. మంగళవారం (జనవరి 24) నుంచి తమిళనాడుతో జరగబోయే మ్యాచ్ కోసం సౌరాష్ట్ర టీమ్‌కు జడేజా కెప్టెన్‌గా ఉండనున్నాడు. ప్రస్తుత కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. దీంతో జడేజాకు సారథ్యం వహించే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్ కోసం జడేజా ఇప్పటికే చెన్నైలో అడుగుపెట్టాడు. ఆదివారం సాయంత్రం ‘వనక్కం చెన్నై’ అంటూ జడ్డూ ఓ ట్వీట్ చేయగా.. అది వైరల్ అయింది. ఐపీఎల్‌లో జడేజా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ఆడతాడన్న విషయం తెలిసిందే. దీంతో చెన్నై జడేజాకు సెకండ్ హోమ్‌గా మారిపోయింది. అదే నగరంలో ఇప్పుడు జడేజా తన కమ్ బ్యాక్ మ్యాచ్ ఆడుతుండటంతో పాటు కెప్టెన్సీ కూడా చేపట్టనున్నాడు. ఇక 2019-20 రంజీ ఛాంపియన్స్ అయిన సౌరాష్ట్ర టీమ్ మంగళవారం నుంచి తమిళనాడుతో తమ చివరి రౌండ్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌కు ఉనద్కత్‌తో పాటు వెటరన్ బ్యాటర్ పుజారాకు మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది.
Zomato Scam: జొమాటో ‘డెలివరీ స్కామ్’.. సీఈఓకు తెలిసి కూడా!
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
గతేడాది ఆగస్ట్‌లో మోకాలి గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన జడేజా మళ్లీ ఇన్నాళ్లకు కాంపిటీటివ్ క్రికెట్ ఆడబోతున్నాడు. అంతేకాదు 2018 నవంబర్ తర్వాత జడేజా ఆడుతున్న తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఇదే. అతడు ఆస్ట్రేలియాతో వచ్చే నెల నుంచి జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. ఆ సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్ జడేజాకు ఎంతగానో ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోంది. కాగా, ఈ రంజీ ట్రోఫీ సీజన్‌లో తమ గ్రూప్‌లో సౌరాష్ట్ర 26 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోం ది. అయితే సొంతగడ్డపై ఆంధ్రాతో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో 150 పరుగుల తేడాతో ఓడిపోయింది. గ్రూప్ టాపర్‌గా ఉన్న సౌరాష్ట్ర ఇప్పటికే క్వార్టర్స్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకుంది.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!