ISSF World Cup2026: ISSF వరల్డ్ కప్‌లో భారత్ డబుల్ ధమాకా.. ఈషాకు గోల్డ్, మనుకు బ్రాంజ్.!
- 25 మీటర్ల పిస్టల్‌లో భారత జోరు
- ఈషా సింగ్ స్వర్ణ పతకం
- మను భాకర్‌కు కాంస్యం
- హాంగ్జౌలో భారత షూటర్ల సత్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISSF World Cup2026 : చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ప్రఖ్యాత ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) వరల్డ్ కప్‌లో భారత మహిళా షూటర్లు సత్తా చాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్‌కు డబుల్ మెడల్ ధమాకా లభించింది. హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని ముద్దాడగా, పారిస్ ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
ఫైనల్లో ఈషా సింగ్ ఆధిపత్యం.. మను పోరాటం
ఫైనల్లో 21 ఏళ్ల ఈషా సింగ్ ఆరంభం నుంచే అద్భుతమైన ఆధిపత్యం ప్రదర్శించింది. నిర్ణీత లక్ష్యాల్లో ఏకంగా 40 హిట్స్ నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. మ్యూనిక్ వరల్డ్ కప్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన తర్వాత ఈషాకు ఇది మరో చిరస్మరణీయమైన గోల్డ్ మెడల్ కావడం విశేషం. మరోవైపు, ఒలింపిక్ విజేత మను భాకర్ తీవ్రమైన పోటీ మధ్య అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన షూట్-ఆఫ్‌లో గెలిచి, 28 హిట్స్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ మళ్లీ గర్జించేది ఎప్పుడు? తదుపరి మ్యాచ్ ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
- Mrunal Thakur and Yashasvi Jaiswal: మృణాల్ ఠాకూర్–యశస్వి జైస్వాల్ డేటింగ్..! వైరల్ వీడియోతో మొదలైన కొత్త చర్చ..
- 2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
- Abhishek vs Samson: అభిషేక్‌కు ఓ రూల్.. సంజుకు మరో రూలా.. బీసీసీఐపై తెలుగు ప్లేయర్ ఫైర్!
క్వాలిఫికేషన్ నుంచే భారత జోడీ జోరు
అంతకుముందు జరిగిన అర్హత (క్వాలిఫికేషన్) రౌండ్లోనే ఈషా, మను టాప్-2 స్థానాల్లో నిలిచి తమ ఫామ్‌ను చాటుకున్నారు. పతకాలు గెలిచిన అనంతరం ఈషా సింగ్ మాట్లాడుతూ.. గతంలో హాంగ్జౌ రేంజ్లో పోటీపడిన అనుభవం తనకు ఎంతగానో కలసివచ్చిందని తెలిపింది. అలాగే రాబోయే ప్రపంచ ఛాంపియన్షిప్ , ఆసియా క్రీడలకు ముందు ఈ డబుల్ పతకాల గెలుపు తమకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని మను భాకర్ హర్షం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు మేకోవర్.. 10 స్టేషన్లతో కొత్త ప్లాన్.!
-
Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తుల కీలక వ్యాఖ్యలు
-
CJP Protest: ఉద్యమం విద్యార్థులదా.? నేరస్తులదా.? ఢిల్లీ పోలీస్ రిపోర్టుల్లో సంచలన విషయాలు..
-
Tati Garelu: నోరూరించే సంప్రదాయ వంటకం..’తాటి గారెలు’ పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా తయారు చేసుకోండి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ మళ్లీ గర్జించేది ఎప్పుడు? తదుపరి మ్యాచ్ ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!