ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ… యూఏఈ వేదికగా జరగనున్న 2021 టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటానని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు తాను చాలా ఆలోచించానని అలాగే తన సన్నిహితులైన రోహిత్ శర్మ అలాగే భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో చర్చించానని తెలిపాడు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆలోచనలో పడిన భారత క్రికెట్ అభిమానులకు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి కూడా తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కోహ్లీ, శాస్త్రి మంచి మిత్రులు అనే విషయం అందరికి తెలిసిందే. అందుకే కోహ్లీ తీసుకున్న నిర్ణయం కారణంగానే రవిశాస్త్రి కూడా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక ఇప్పటికే కోహ్లీ తర్వాత భారత జట్టుకు కెప్టెన్ ఎవరు అవుతారు అనే ఆలోచనలో ఉన్న క్రికెట్ అభిమానులు… ఇప్పుడు రవిశాస్త్రి తర్వాత భారత హెడ్ కోచ్ పదవి బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారు అని అనుకుంటున్నారు.
హెడ్ కోచ్ పదవికి రవిశాస్త్రి రాజీనామా..?
