Abhishek Sharma: అభిషేక్ శర్మ.. నీకు సమయం ఆసన్నమైంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuvraj Singh Lauds Travis Head Batting in IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (75 నాటౌట్; 28 బంతుల్లో 8×4, 6×6), ట్రావిస్ హెడ్ (89 నాటౌట్; 30 బంతుల్లో 8×4, 8×6) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. లక్నో బౌలర్లపై ఉప్పెనలా విరుచుకుపడి.. పరుగుల వరద పారించారు. నువ్వా నేనా అని పోటీ పడుతూ బౌండరీలు, సిక్సులు బాదిన అభిషేక్, హెడ్.. ఉప్పల్ స్టేడియాన్ని పరుగుల వరదతో ముంచెత్తారు. ఈ ఇద్దరి బ్యాటింగ్‌పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల బ్యాటింగ్‌పై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పందించాడు. ‘అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడావు. ఇలాగే నిలకడగా ఆడు, కాస్త ఓపికగా ఉండు. నీకు సమయం ఆసన్నమైంది’ అని యువీ తన ఎక్స్‌లో పేర్కొన్నాడు. త్వరలో భారత జట్టులోకి అభిషేక్ ఎంట్రీ ఇవ్వాలని యువరాజ్ ఆకాంక్షించాడు. ‘నా మిత్రమా ట్రావిస్ హెడ్.. నువ్ ఏ గ్రహం మీద బ్యాటింగ్ చేస్తున్నావ్. నమ్మశక్యంగా లేదు నీ బ్యాటింగ్’ అని ప్రశంసించాడు.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడటం పక్కా!
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అభిషేక్ శర్మ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి.. 401 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 205 స్ట్రైక్ రేట్‌తో అతడు పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో అభిషేక్ వరుసగా 32(19), 63(23), 29(20), 37(12), 16(11), 34(22), 46(12), 31(13), 15(9), 12(10), 11(16), 75*(28) రన్స్ చేశాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ 12 మ్యాచ్‌లలో 533 రన్స్ బాదాడు.
Well played @IamAbhiSharma4 be consistent be patient ! Your time is around the corner ☝️! @travishead34 what planet are you batting my friend 🤷🏻♂️? Unreal !!! #SRHvsLSG #IPL2024
— Yuvraj Singh (@YUVSTRONG12) May 8, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..