IPL 2023 : 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో తొలుత పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ నిష్క్రమించడంతో.. పంజాబ్ జట్టు ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పకుండా ధావన్ సేన విజయం సాధించా తీరాల్సిందే. మరీ పంజాబ్ గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుందా..? లేక ఢిల్లీ క్యాపిటల్స్ షాకిస్తుందా..? అనేది వేచి చూడాలి..
Also Read : Andhra Pradesh Crime: యువతులతో నగ్న పూజలు.. బంధించి అత్యాచారం..!
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు కింగ్స్ సెకండ్ ఓవర్ లోనే పెద్ద షాక్ తగిలింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో రిలీ రోసో క్యాచ్ అందుకోవడంతో కెప్టెన్ శిఖర్ ధావన్ (7) ఔట్ అయ్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 10 పరుగులకే(1.2వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్ ( 4 )ను కూడా ఇషాంత్ శర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 32 పరుగులకే(4.1వ ఓవర్) పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 5 ఓవర్లకు పంజాబ్ స్కోరు 38/2గా నిలిచింది.
Also Read : Punjabi Mother : మదర్స్ డేకి వెరైటీ గిఫ్ట్ అడిగిన పంజాబీ మదర్
క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ కూడా ఎక్కువ సేపు గ్రౌండ్ లో నిలవలేక పోయాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో జితేశ్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 45 పరుగులకే (5.4వ ఓవర్) పంజాబ్ మూడో వికెట్ ను కోల్పోయింది. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టు 10 ఓవర్లకు 66 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను చేజార్చుకుంది. క్రీజులో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 27 ( 31 ) తో పాటు సామ్ కర్రన్ 12( 14 ) ఉన్నారు.

తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..