Virat Kohli-RCB: ఆర్సీబీ అసలు మాస్టర్‌మైండ్ కోహ్లీనే.. పాకిస్థాన్ మాజీల ప్రశంసలు!
- డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ
- వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ విజయం
- ఆర్సీబీ అసలు మాస్టర్‌మైండ్ కోహ్లీనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి అజేయంగా నిలిచింది. ఐపీఎల్ 2025లో ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ.. ఇప్పుడు అదే ఫామ్ కొనసాగిస్తూ మరో టైటిల్ లక్ష్యంగా దోసుకెళుతోంది. ఆర్సీబీ విజయాలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు బాసిత్ అలీ, కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీనే ఈ మార్పుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.
బాసిత్ అలీ మాట్లాడుతూ… ‘ఆర్సీబీ ఇప్పుడు పూర్తి స్థాయి జట్టుగా మారింది. గతంలో బౌలింగ్ బలహీనంగా ఉండేది. కానీ ఇప్పుడు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా బలంగా ఉంది. జాకబ్ డఫీ, కృనాల్ పాండ్య వంటి ఆటగాళ్లు జట్టుకు కీలకంగా మారారు. అయితే మైదానంలో అసలు మాస్టర్‌మైండ్ మాత్రం విరాట్ కోహ్లీనే. కెప్టెన్‌గా రజత్ పాటిదార్ ఉన్నప్పటికీ.. గేమ్‌ను నడిపించేది కోహ్లీ ఆలోచనలే. టిమ్ డేవిడ్ బ్యాటింగ్ చూస్తే పుస్తకం చదివినట్లే ఉంటుంది. అతడు క్రీజులో ఉంటే ఫోర్ లేదా సిక్స్ తప్ప ఇంకేమీ ఉండదు’ అంటూ ప్రశంసించాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Vaibhav Sooryavanshi: భారత జట్టులో తీవ్ర పోటీ.. వైభవ్ సూర్యవంశీకి అప్పుడే ఛాన్స్ అవసరమా?
ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌పై కమ్రాన్ అక్మల్ ప్రశంసలు కురిపించాడు. ‘హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, మెంటర్ అండ్ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ జట్టు కోసం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇద్దరు కొన్ని నెలల ముందే టీమ్ కాంబినేషన్‌పై పని చేశారు. అందుకే ఇప్పుడు ఆర్సీబీ విజయాలు అందుకుంటోంది. ముంబై ఇండియన్స్ టిమ్ డేవిడ్‌ను విడుదల చేయడంపై నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆర్సీబీ అతడిని దీర్ఘకాలం కొనసాగించాలి. ప్రతి ఏడాది కోహ్లీ తన ఆటను మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు. ఈ సీజన్‌లో మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాడు. అతడి పరుగుల దాహం, అటిట్యూడ్ అసాధారణం’ అని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!